మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్టుగా కనిపించడం లేదు.   గత ఐదు రోజులుగా ఈ సమస్య ఇలానే కొనసాగుతోంది. ఈరోజు అమిత్ షా ముంబై వస్తుండటంతో..ఈరోజుతో అయినా.. సమస్యకు చెక్ పెడతారేమో చూడాలి.  మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నది.  కాకపోతే ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడానికి బీజేపీ ససేమిరా అంటోంది.  శివసేన కూడా అదే పట్టుదలతో ఉన్నది.  బీజేపీని డైరెక్ట్ గా విమర్శించడం మొదలుపెట్టింది.  


సామ్నా పత్రికలో బీజేపీ గురించి దారుణంగా రాస్తున్నది.  మొన్నటి వరకు కాశ్మీర్ విషయాన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్న శివసేన.. ఇప్పుడు కాశ్మీర్ అంశంపై కూడా మాట్లాడటం మొదలుపెట్టింది.  కాశ్మీర్ సమస్య అంతర్గత విషయం అని చెప్పినపుడు.. కాశ్మీర్ లో విదేశీ ప్రతినిధులకు ఏం పని అని ప్రశ్నించింది.  మరోదేశం కాశ్మీర్ విషయంలో మాట్లాడటానికి ఒప్పుకొని ప్రధాని, ఇప్పుడు కాశ్మీర్లో విదేశీ ప్రతినిధులు పర్యటించడానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది.  


బీజేపీతో గత 31 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న పార్టీ ఏ  విషయంలో అయినా వ్యతిరేకించవచ్చుగాని, కాశ్మీర్ విషయంలో మాట్లాడటం తప్పని విశ్లేషకులు అంటున్నారు.  కాశ్మీర్ విషయం గురించి అంతర్గతంగా రాజకీయ పార్టీలు మాట్లాడితే అది ఇండియాపై ఎఫెక్ట్ చూపుతుందని, పార్టీల మధ్య ఎన్ని గొడవలైన ఉండొచ్చు.. అవి పార్టీల పరంగా చూసుకోవాలిగాని, ఇండియాకు ఇబ్బంది కలిగించే విధంగా మాత్రం మాట్లాడకూడదని అంటున్నారు.  


బీజేపీ మాత్రం శివసేన గురించి పెద్దగా కామెంట్స్ చేయడం లేదు.  తానే మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని ఫడ్నవిస్ అంటున్నాడు.  శివసేన గురించి మాట్లాడొద్దని, శివసేనతో ఉన్న విభేదాలు త్వరలోనే పరిస్కారం అవుతాయని అన్ని తొందరలోనే సర్దుకుంటాయని అంటున్నాడు. షా ఎలాగో ముంబై వచ్చాడు కాబట్టి ఈ విషయంలో ఏవైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.  ఏది ఏమైనా రెండు పార్టీల మధ్య త్వరగా చర్చలు జరిగి సమస్యలు కొలిక్కి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది.  కాలయాపన చేసే కొద్దీ సమస్య పెరుగుతుంది తప్పించి తగ్గదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: