ఆగష్టు 5 వ తేదీన జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది ఎన్డీయే.  ఈ నిర్ణయంతో దేశంలోని అనేక పార్టీలు ఆహ్వానించాయి.  కాంగ్రెస్ తో పాటు కొన్ని మిత్రపక్షాలు మాత్రం దీనిని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.  కాగా, జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.  అక్టోబర్ 31 నుంచి జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలు పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతాలుగా మారబోతున్నాయి.  


ఆ తరువాత ఆ రాష్ట్రాలకు చెందిన రక్షణ, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అంతా కేంద్రం చేతిలో ఉంటుంది.  అక్కడ ఎలాంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా సైన్యం వెంటనే సమస్యను పరిష్కరిస్తుంది.  ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఏ రాజకీయ నాయకులు పర్యటించేందుకు అనుమతి ఇవ్వడం లేదు.  అక్టోబర్ 10 నుంచి జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. 


కాగా, ఇప్పుడు యూరోపియన్ ప్రతినిధుల బృందం కాశ్మీర్లో పర్యటించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి.  రాజకీయ నాయకులు పర్యటించేందుకు అనుమతి లేదని చెప్తున్న కేంద్రం, విదేశీ ప్రతినిధులకు ఎలా అనుమతి ఇస్తారని మండిపడుతున్నారు.  కాశ్మీర్ విషయం దేశ అంతర్గత వ్యవహారం అని చెప్తున్న కేంద్రం, ఇప్పుడు విదేశీ ప్రతినిధులు పర్యటించేందుకు అనుమతి ఇచ్చి.. సమస్యను అంతర్జాతీయం చేసిందని విమర్శిస్తున్నారు.  


కాంగ్రెస్ పార్టీ నేతలు యూరోపియన్ ప్రతినిధులు కాశ్మీర్లో పర్యటించడాన్ని తప్పు పడుతున్నారు.  సమస్య సున్నితమైనదైనపుడు వాళ్ళను ఎలా అనుమతిస్తారని మండిపడుతున్నారు.  రేపటి నుంచి జమ్మూ కాశ్మీర్, లడక్ లు కేంద్రపాలిత ప్రాంతాలుగా పూర్తిగా మారబోతున్నాయి.  రేపటి నుంచి ఆ రాష్ట్రం అభివృద్ధికి కావాల్సిన అన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నది.  యూరప్ నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు కేంద్రం ఆ ప్రతినిధులకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: