మాట్లాడటం ఒక కళ. మాట ఎంత పనినైనా చేయిస్తుంది. మనసుల మధ్య చిచ్చు పెట్టాలన్నా, ఆ మనసుల మధ్య దూరం తగ్గాలన్న మాటల వల్లనే సాధ్యం. కొందరు మాట్లాడుతుంటే ఎందుకో అలానే వింటుండిపోతాం. వాళ్ళు మాటలతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు. రాజకీయాల్లో తన మాటల ద్వారా జనాలని ప్రభావితం చేసే గొప్ప రాజకీయ నాయకులలో కేసీఆర్ ఒకరు. ఆయనని విమర్శించే వారు సైతం కేసీఆర్ మాటకారి అని చెప్తారు.


అయితే తెలంగాణ ఆర్టీసీ సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలని కార్మికులు డిమాండ్ చేస్తుంటే ససేమిరా కలపేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించాడు. ప్రెస్ మీట్ లో చాలా అంశాల మీద మాట్లాడిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విలీనంపై పరోక్షంగా మాట్లాడారు. ఆర్టిసీని ప్రభుత్వంలో కలపడం పాతకాలపు చర్య అని అన్నాడు.


తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో కలపబోయేది లేదని చెప్తుంటే ఆంధ్రలో మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన మాటలు ఏపీ మంత్రులని తాకాయి.విజయవాడ ఆర్టీసీ ఆసుపత్రిలో టీడీపీ ఎంపీ కేశినేని తన నిధులతో నిర్మించిన వసతి భవనాన్ని పేర్ని నాని ప్రారంభించారు. 


ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్నామని.. వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరం అవుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేసిందన్నారు. ఇది చాలా గొప్ప నిర్ణయమని, కేసీఆర్ మాటలు తమలో కసిని పెంచాయని.. పట్టుదల పెరిగేలా చేశాయని అన్నారు. సీఎం జగన్ చెప్పిన ఆలోచన మేరకే ఆర్టీసీ కార్మికుల్ని విలీనం చేస్తామని చెప్పామని.. దాన్ని అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: