నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు విజయవాడ లో మంగళవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. తొలి రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు పెడన, కైకలూరు, మచిలీపట్నం, జగ్గయ్యపేట, తిరుపూర్ నియోజవర్గాల సమీక్ష సమావేశాలు జరిగాయి.  పార్టీకి నమ్మకంతో పనిచేసే కార్యకర్తలను గుర్తించాలని,నిర్ణయాల్లోజాప్యం ఉండరాదని,  సరైన నిర్ణయాలు సరైన  సమయంలో తీసుకుంటే పార్టీకి ఉపమోగకరమని కార్యకర్తలు సమావేశంలో బాబు గారికి వివరించడం జరిగింది.


దానికి సమాధానంగా బాబు గారు, పార్టీకోసం పరితపించే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందనివ్యాఖ్యానించారు. ఎన్నికలే లక్షంగా పనిచేస్తున్న జననేతలకే అవకాశాలు వస్తాయి అన్నారు. మరియు ఓటమికి గల కారణాలు విశ్లేషించి, అవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యత ఉందని బాబుగారు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో మిత్రపక్షం అయిన భాజపా  నుగెలిపించిన మీరు , స్వంత పార్టీని గెలిపించలేక పోవడమేమిటని కైకలూరు నియోజకవర్గ నేతలను, బాబు గారు ప్రశ్నించగా, దానికి డబ్బు పంపిణీ  ప్రభావమేనని నేతలు సమాధానమివ్వగా,  చిత్తశుద్ది ముందు డబ్బు పనికి రాదని బాబు గారు బదులు ఇవ్వడం జరిగింది.


 పలుచోట్ల ఓటమికి గల బలమైన కారణాలు, తప్పిదాలను గురించి చర్చ, సమావేశంలో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. అందులో మొదటిది, పెడన నియోజకవర్గం అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం, దీని వల్ల జనసేన అభ్యర్థి ప్రచారం లో ముందుండడం  వలన తేదీపా ఓటు శాతం తగ్గి జనసేన అభ్యర్థికి పెరిగిందని కార్యకర్తలు వారి అభిప్రాయాలను  తెలియజేశారు, పటిష్ట ప్రణాళికతో 2024 ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగుర వేయడానికి ముందుకు సాగాలని జగ్గయ్యపేట మరియు తిరువూరు, నియోజకవర్గ ప్రజలకు సూచించారు, జగ్గయ్యపేట తెదేపాకు పెట్టని కోట అని కార్యకర్తలు  ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని బాబు గారు సూచించారు. 


సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ వైకాపా రద్దు ప్రభుత్వం అని, రివర్స్ పాలన చేస్తోందని విమర్శించారు.  సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని అభిప్రాయపడ్డారు. ఎంపీ కేశినేని నాని గారు, తెదేపా ఒక ఉమ్మడి కుటుంబం అని, కార్యకర్తలు గర్జించే పులుల వలే ఉండాలని పిలుపునిచ్చారు. తెదేపా ఉచితంగా ఇచ్చిన ఇసుకను ఇప్పుడు లక్షల రూపాయలకు విక్రయించి దోచుకుంటున్నారని వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించారు.


రాజ్యాంగం రాసిన సమయంలో రిమాండ్ ఖైదీలు ముఖ్యమంత్రి అవుతారని అంబేద్కర్ భావించినట్లయితే ఆనాడే రాజ్యాంగాన్ని మార్చి రాసే వారని పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. మాజీ ఎంపీ కొనకొల్ల నారాయణ వైకాపా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఉన్నతాధికారులు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: