నోరిప్పాలంటేనే చంద్రబాబునాయుడు వణికిపోతున్నట్లున్నాడు. ఎన్నికల ముందు నరేంద్రమోడి, అమిత్ షా లపై ఎంతగా రెచ్చిపోయారో ఇపుడు అంతలా మౌనం పాటిస్తున్నారు. దేశం మొత్తం మీద నరేంద్రమోడిని చంద్రబాబు విమర్శించినట్లు, ఆరోపణలు చేసినట్లు మరే ప్రతిపక్ష నేతలు విమర్శించలేదు.

 

మోడికి వ్యతిరేకంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో తిరిగి ప్రచారం చేశారు. సరే చంద్రబాబు మోడికి వ్యతిరేకంగా ఎవరికి మద్దతిస్తు ప్రచారం చేశారో అక్కడల్లా ఆయా పార్టీలు బాగా దెబ్బతిన్న విషయం అందరూ చూసిందే. అసలు చంద్రబాబు తమ రాష్ట్రాల్లో ప్రచారానికి రాకుండా ఉండుంటే బాగుండేదని తర్వాత చాలామంది నేతలు అనుకున్నారట. సరే ఎన్నికల్లో చంద్రబాబు ఎంతగా రెచ్చిపోయారో అంత ఘోరంగా దెబ్బతిన్నారు.

 

ఎప్పుడైతే టిడిపి దెబ్బతిని నరేంద్రమోడి మంచి మెజారిటితో రెండోసారి ప్రధని అయ్యారో అప్పటి నుండే  చంద్రబాబు వణికిపోతున్నారు. అందుకనే నరేంద్రమోడి, అమిత్ షా ల గురించి అసలు నోరే విప్పటం లేదు. ఎన్నికలై ఇప్పటికి సుమారుగా ఐదు మాసాలవుతోంది. ఈ ఐదునెలల్లో ఫార్టి ఇయర్స్ ఇండస్ట్రీ కనీసం  ఒక్కసారంటే ఒక్కసారి కూడా మోడి, అమిత్ లకు వ్యతిరేకంగా నోరిప్పిన పాపాన పోలేదు.

 

ఆర్టికల్ 370 గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. రూ. 2 వేల నోట్ల ప్రింటింగ్ ను నిలిపేసినట్లు కేంద్రం ప్రకటించినా పట్టించుకోలేదు. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసినా అసలు తెలియనట్లే నటిస్తున్నారు. అంటే ఇటువంటి విషయాలపై గతంలో మోడికి వ్యతిరేకంగా అనేకసార్లు గొంతు చించుకున్నారు లేండి.

 

కేంద్ర మాజీమంత్రి చిదంబరంపై కేసులు పెట్టి జైల్లో వేసినా ఆ విషయం తెలియనట్లే ఉండిపోయారు. స్పందించాల్సిన అనేక అంశాలపై మాట్లాడకపోగా తనకు నమ్మకస్తులైన నలుగురు రాజ్యసభ ఎంపిలను దగ్గరుండి బిజెపిలోకి ఫిరాయించేట్లు చేశారు. అలాగే తన సన్నిహితుడైన మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి లాంటివాళ్ళను కూడా బిజెపిలోకి పంపేశారు. జరుగుతున్న విషయాలు  చూస్తుంటే మోడి అంటేనే చంద్రబాబు ఎంతలా వణికిపోతున్నారో అర్ధమైపోతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: