ప్రధాన రాజకీయ పార్టీ బిజెపి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని ఫుల్లుగా ర్యాగింగ్ చేస్తున్నట్లే ఉంది. పార్టీకి చెందిన కీలక నేతలు, జాతీయ స్ధాయి నేతలు రోజుకో ప్రకటన చేస్తు చంద్రబాబునాయుడుతో ఓ ఆటాడుకుంటున్నారు. ఓ నేతేమో టిడిపితో పొత్తు విషయంలో బిజెపి తలుపులు మూసేసిందని చెబుతారు. మరో నేత మాట్లాడుతూ టిడిపి దగ్గర ఏం మిగిలుందని తాము పొత్తులు పెట్టుకోవాలని ఎద్దేవా చేస్తారు.

 

అదే సమయంలో టిడిపితో పొత్తు అవసరం లేదని కాకపోతే తమ పార్టీలో చంద్రబాబు చేరుతానంటే అగ్రనేతలతో తాము మాట్లాడుతామంటూ మరో నేత ప్రతిపాదించారు. చివరగా మరో నేత మాట్లాడుతూ టిడిపిని బిజెపిలో విలీనం చేయటం తప్ప చంద్రబాబుకు మరో దారిలేదని తేల్చేశారు. ఇటువంటి ప్రకటనలు ఒకసారి కాదు పదే పదే చేస్తున్నారు.

 

జాతీయ స్ధాయి నేతలైతే తొందరలో చంద్రబాబుకు జైలు జీవితం ఖాయమని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అదే సమయంలో చంద్రబాబుపై సిబిఐ విచారణకు రాష్ట్రప్రభుత్వం లేఖ రాస్తే కేంద్రంతో మాట్లాడి విచారణ జరిగేట్లు చూసే బాధ్యత తనదే అంటూ మరో నేత వైసిపి ప్రభుత్వానికి ఓపెన్ ఆఫర్ ఇవ్వటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.

 

ఒకవైపేమో తెలుగుదేశంపార్టీకి చెందిన నేతల్లో ఎంతమందిని వీలైతే అంతమందినీ తమ పార్టీలోకి చేర్చుకోవాలనే టార్గెట్ తో బిజెపి పావులు కదుపుతోంది.  రాష్ట్రంలోని కీలక నేతలు టార్గెట్ రీచవటంలో భాగంగా ఓ వ్యూహంతో ముందుకెళుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే.

 

నవంబర్ మాసంలో కేంద్రమంత్రి, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డాలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. వీళ్ళ పర్యటనల ప్రధాన ఉద్దేశ్యం వలసలను ప్రోత్సహించటమే అనటంలో సందేహం లేదు. బిజెపి నేతల వైఖరి చూస్తుంటే చంద్రబాబును ఫుల్లుగా ర్యాగింగ్ చేస్తున్నట్లే ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: