ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందరు చర్చించుకుంటున్న వార్త తెలంగాణ ఆర్టీసీ సమ్మె గురించే. ఈ సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరుకు హైకోర్టు మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సమ్మె తీరులో తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసి కార్మికులు తమతమ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతుండగా ప్రజల మనోగతం మాత్రం ఇంత వరకు ఇదని బయటపడటం లేదు. ఇంతకు ఈ సమ్మె విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచించే ప్రయత్నం చేయడం లేదు. మరి సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందా అంటే ప్రయాణం చేసే ప్రయాణికులు మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాత్రం తెలుస్తుంది. ఇకపోతే స్వంతగా వాహనాలున్నవారు ఈ సమయంలో తమ తమ వాహనాలకు పని చెబుతున్నారు.


ఇకపోతే ఇప్పుడున్న పరిస్దితుల్లో కేసీఆర్ సర్కారుకు సెగ పుట్టించేలా ఆర్టీసీ కార్మికులు, ప్రజాసంఘాలు, రాజకీయాలు పార్టీలు కలిసి జేఏసీగా ప్రత్యక్ష ఉద్యమకార్యాచరణకు దిగబోతున్నాయని తెలుస్తుంది. ఈ పరిణామం చూస్తుంటే తెలంగాణలో మరో సకలజనుల సమ్మెకు ఈ సభ పురుడుపోస్తుందనే టెన్షన్ ప్రభుత్వ వర్గాలను పట్టి పీడిస్తోందని వినవస్తుంది.. ఇక తెలంగాణలో ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమని, ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఎన్నికల హామీలను కేసీఆర్‌ అమలు చేయలేకపోతున్నారని. హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు కలిసిన సందర్భంగా కోదండరామ్‌ తెలిపారు.


మరో వైపు  ప్రజలకు అసౌకర్యం కలిగినా ఫరవాలేదు,  స్వలాభం కోసం ఆర్టీసీ నష్టపోయినా బాధలేదు అనే అభిప్రాయంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెను మొండిగా కొనసాగిస్తున్నాయని ప్రజల్లో అభిప్రాయం బలపడటం వల్ల, ఆర్టీసీ సమ్మెకు ప్రజల్లో పెద్దగా స్పందన రావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారట. ఇంతే కాకుండా సంస్థను నష్టాల బాట పట్టించిన కార్మికులే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు, అన్ని సౌకర్యాలను పొందేందుకు సమ్మె చేస్తున్నారు అంతేగాని, సంస్థ బాగు కోసం కాదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇకపోతే ఏది ఏమైనా..  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ విషయంలో ఓ కచ్చితమైన నిర్ణయం తీసుకున్నందున ఇక చేయగలిగింది ఏమీ లేదన్న గుసగుసలు  తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.


ఇక  రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలకు తోడుగా పెద్ద ఎత్తున కదులుతున్నాయి. దానికి కారణం. సందర్భం దొరికినపుడల్లా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకునే ఆలోచనలతో రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు పెద్ద ఎత్తున సంఘీ భావం ప్రకటిస్తు. వీలైనంతగా  రెచ్చగొడుతున్నాయని వినిపిస్తుంది.. మరోవైపు ఉద్యమంలో వాడుకుని గెలిచిన తర్వాత పెద్దగా పట్టించుకోవట్లేదీ కేసీఆర్ అని ఫీలవుతున్న కొన్ని ప్రజా సంఘాలు సైతం ఆర్టీసీ కార్మికుల వెంట నడుస్తున్నాయని వినిపిస్తుంది. ఇదేకాకుండా 21 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా వుంటే. ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఒకే ఒక డిమాండ్‌ను కార్మిక సంఘాలు పట్టుకుని వేలాడడం ఏంటన్నది ఇప్పుడు జనంలో నానుతున్న ప్రశ్న.


ఇక ప్రభుత్వంలో కలిపేస్తే.. తాము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడతామని, ఆ తర్వాత కాలు మీద కాలేసుకుని దర్జా ప్రదర్శించవచ్చన్నది కార్మిక సంఘాల ఉద్దేశంగా ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఇకపోతే ఎవరు ఎన్ని రాజకీయ చదరంగాలు ఆడిన చివరకు బలైయ్యేది ప్రజలే అన్న విషయాన్ని అందరు గుర్తిస్తే మంచిదంటున్నారు విశ్లేషకులు. ఇక సకలజనుల సభ వల్ల తెలంగాణ ప్రభుత్వంలో ఏమైన మార్పు కలుగుతుందో లేదో వేచి చూడాలను కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: