రాజకీయాల్లో ఓ నేత పదే పదే ఓడిపోతున్నాడంటే..అతను ప్రజలకు నచ్చడం లేదనో లేదా అతను సరైన అభ్యర్ధి కాదనో అర్ధం. మళ్ళీ అతనికి పోటీ చేసే అవకాశం కల్పిస్తే ప్రజలు తిరస్కరించడం ఖాయంగా జరుగుతుంది. కరెక్ట్ గా అదే పరిస్తితి 2014 వరకు కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత నల్లగట్ల స్వామిదాస్ 1994,99 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ 2004,2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయ్యారు. అక్కడ గత మూడు సార్లుగా కాంగ్రెస్, వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. వైసీపీ అభ్యర్ధులని ప్రజలు గెలిపించారు.


ఇక మొన్న ఎన్నికల్లో కూడా స్వామిదాస్ పోటీ చేయాలనుకున్నారు. కానీ అతనికి టికెట్ ఇస్తే ముందే పరాజయం కన్ఫామ్ చేసుకోవచ్చు. దీంతో చంద్రబాబు 2014లో వెస్ట్ గోదావరి కొవ్వూరు నుంచి గెలిచి మంత్రిగా పని చేసిన జవహ‌ర్‌ను తిరువూరు బరిలో దింపారు. అయితే జవహర్ బరిలో ఉండటంతో వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.వైసీపీ అభ్యర్ధికి పోటీ ఇవ్వగలిగారు. కానీ ఎన్నికల ముందే నియోజకవర్గంలో దిగడం, పూర్తిగా కేడర్ సహకరించకపోవడంతో జవహర్ ఓటమి పాలయ్యారు. కానీ ఉన్నంత వరకు బాగానే హార్డ్ వర్క్ చేశారు.


అయితే ఇప్పుడు  ఓటమి తర్వాత కూడా జవహర్  తిరువూరులో పని చేస్తున్నారు. కాకపోతే ఇన్‌చార్జ్‌ను మాత్రం బాబు ఇక్క‌డ నియమించలేదు. ఈ క్రమంలోనే వరుస ఓటమిలతో ఔట్ డేటెడ్ నాయకుడు అయిపోయిన నల్లగట్ల ఇన్-చార్జ్ పోస్టు కోసం పాకులాడుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వెంట వ‌చ్చే ఒక‌రిద్ద‌రు నాయ‌కుల‌ను వెంటేసుకుని హ‌డావిడి చేస్తూ పార్టీలో డిస్ట‌ర్బ్ క్రియేట్ చేస్తున్నాడు.


కానీ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నేతలు ఎక్కువ శాతం జవహర్‌నే కావాలని కోరుతున్నారు. అలాగే వ‌రుస ప‌రాజయాల‌తో ఔట్ డేట్ అయిపోయిన స్వామిదాస్ ఇప్పటికైనా పక్కకు తప్పుకుని వెనుక ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తే మంచిదని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక బాబు కూడా జవహర్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: