ఒక ఓట‌మి అనేక పాఠాల‌కు నాంది ప‌లుకుతుంది. ఒక ఓటమి నుంచి అనేక విజ‌యాలు పుట్టుకు వ‌స్తాయ నేది కూడా నిజ‌మే.గ‌త చ‌రిత్ర కూడా ఇదే చెబుతోంది. 2014లో కొద్ది తేడాతో అధికారానికి దూర‌మైన వైసీపీ తిరి గి ఆ ఓట‌మి నుంచి నేర్చుకున్న అనేక పాఠాలు.. విజ‌యానికి దారి తీశాయి. ఫ‌లితంగా ఎవ‌రూ ఊహిం చని విధంగా అధికారంలోకి వ‌చ్చారు. అయితే, ఇప్పుడు అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్ర‌బా బు ఈ ఓట‌మి నుంచి నేర్చుకున్న పాఠాలు ఏమైనా ఉన్నాయా? ఆయ‌న ఈ ఓట‌మి నుంచి తిరిగి విజ‌యం సాధించే దిశ‌గా చేప‌ట్టిన చ‌ర్య‌లు ఉన్నాయా? అంటే.. ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల కులు.


తాజాగా జిల్లాల రాజ‌కీయాల‌కు సంబంధించి భారీగా విస్తృత మ‌హాస‌భ‌ల‌ను ఏర్పాటు చేసి, త‌మ్ముళ్లంద‌రి నీ ఒకే వేదిక‌పైకి తీసుకువ‌చ్చి.. ఆయ‌న ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టా రు. అయితే, ఇది తొలి రోజే గాడి త‌ప్పింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. యువ‌త‌కు అవ‌కాశం ఇస్తాన‌ని, వారిని ప్రోత్స‌హించ‌క పోవ‌డం వ‌ల్లే రాష్ట్రంలో టీడీపీ రెండో సారి అధికారినికి దూర‌మైంద‌ని ఇటీవ‌ల ప‌లు మార్లు చెప్పిన చంద్రబాబు.. ఈ వేదికగా వారికి అవ‌కాశాలు ఇచ్చే అంశంపై దృష్టి పెడ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, పాడిందే పాట మాదిరిగా..చంద్ర‌బాబు త‌న ఉపోద్ఘాతంతోనే స‌రిపెట్టుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.


తాజాగా నిర్వ‌హించిన విస్తృత స్థాయి స‌మావేశంలో కేవ‌లం జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించేందుకు, త‌న ను గొప్ప‌గా వ‌ర్ణించుకునేందుకు మాత్ర‌మే చంద్ర‌బాబు వినియోగించుకున్నార‌ని సాక్షాత్తూ టీడీపీలోని ఓ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది. ఎవ‌రికీ మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కుండా గంట‌ల త‌ర‌బ‌డి బాబే ప్ర‌సంగాలు గుప్పించార‌ని, గ‌తం చెప్పుకోవ‌డంతోనే ఆయ‌న స‌మ‌యం తినేశార‌ని అంటున్నారు. వాస్తవంలో కి వ‌చ్చి.. పార్టీని న‌డిపించే విధానంపై ఆయ‌న ఎక్క‌డా దిశానిర్దేశం చేయ‌క‌పోవ‌డాన్ని త‌మ్ముళ్లు త‌ప్పు ప‌డుతున్నా రు. స్వోత్క‌ర్ష-ప‌ర‌నింద‌ల‌కే ప్రాధాన్యం ఇస్తూ పోతే.. పార్టీ గాడిన ప‌డేది ఎన్న‌డ‌నే వ్యాఖ్య‌ల‌ను బాబు ఇప్ప‌టికైనా గ్ర‌హించాల‌ని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: