అక్టోబర్ నెల అయిపోయింది. ఇంకొక్క రోజు ఉంటె నవంబర్ కి వెళ్ళిపోతాం. అదిగో ఇదిగో అని అనుకుంటూనే సంవత్సరం చివరిలోకి వచ్చేశాం. అయితే అక్టోబర్ లో బ్యాంకులకు భారీగా సేలవులు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకరోజు బ్యాంకు సమ్మె అయితే మరో రోజు హాలిడే.. ఇలా ప్రజలు అంత ఈ అష్టకష్టాలు పడ్డారు. 

                                   

అయితే ఈ నవంబర్ నెలలో అన్ని సెలవులు లేవు కానీ సమ్మె జరిగితే మాత్రం చెప్పలేం. అయితే ఇంకా విషయానికి వస్తే నవంబర్ నెలలో వివిధ సందర్భాల్లో, వివిధ పండుగల కారణంగా బ్యాంకులు బంద్ అవ్వనున్నాయి. ఎప్పటిలాగే ప్రతి ఆదివారం బ్యాంకుకు సెలువు రాగా రెండు నాలుగు శనివారాల్లోనూ బ్యాంకులకు సెలవులు రానున్నాయి. 

                                           

కాగా పండుగలకు సెలవులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన పండుగలకు కూడా ఆ ప్రాంతాల్లో సెలవులు ఇస్తారు. నవంబర్ నెలలో 3, 10, 17, 24 తేదీల్లో ఆదివారాలు. బ్యాంకులకు సెలవు రోజులు. 9, 23 తేదీలు రెండు, నాలుగో శనివారాలు ఉంటాయి. అంటే నవంబర్ 3, 9, 10, 17, 23, 24 పబ్లిక్ హాలీడేస్. నవంబర్ 12వ తేదీన గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ దీంతో ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే నగదు ఉపసంహరణ, డిపాజిట్, ట్రాన్సుఫర్‌ల కోసం బ్యాంకులకు ఎక్కువగా వెళ్లేవారు ముందు జాగ్రత్త పండండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: