సానుకూలంగా ఉద్దేశంతో...జన‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌తిపాద‌న‌కు ఊహించ‌ని స్పంద‌న వ‌స్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని భవన నిర్మాణ కార్మికులకు చెందిన‌ ఇసుక సమస్య పరిష్కారంలో భాగంగా, జనసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ తలపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా,  తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె కోసం అక్కడి రాజకీయపక్షాలు ఎటువంటి స్ఫూర్తి చూపుతున్నాయో ఇసుక సమస్య పరిష్కారానికి, లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మళ్ళీ ఉపాధి లభించేలా సమైక్యంగా అన్ని రాజకీయ పక్షాలు ముందుకు వెళ్లాలని ప‌వ‌న్ భావించారు. ఇందుకోసం ఆయ‌న కీల‌క ముంద‌డుగు వేశారు.


ఏపీలో క్రియాశీలంగా ఉన్న ఆయా రాజ‌కీయ పార్టీల ముఖ్య‌నేత‌ల‌కు ప‌వ‌న్ స్వ‌యంగా ఫోన్ చేశారు. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వామ‌పక్షాల నేత‌లు మధు, రామకృష్ణ, కాంగ్రెస్ నేత‌ తులసిరెడ్డి, లోక్‌స‌త్తా, బీఎస్‌పీ నేత‌లకు ప‌వ‌న్ ఫోన్ చేశారు. లాంగ్ మార్చ్‌లో తమ తమ కార్యకర్తలతో కలసి పాల్గొనవలసిందిగా కోరారు. చంద్ర‌బాబు, క‌న్నా సానుకూలంగా స్పందించార‌ని జ‌న‌సేన తెలిపింది. పార్టీలో చర్చించిన అనంత‌రం నిర్ణ‌యం చెప్తామ‌ని కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా, బి.ఎస్.పి. నేతలు చెప్పిన‌ట్లు జ‌న‌సేన పేర్కొంది. 


అయితే, చంద్ర‌బాబు-ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని భవన నిర్మాణ కార్మికులకు చెందిన‌ ఇసుక సమస్య పరిష్కారంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడాన్ని చంద్ర‌బాబు స్వాగ‌తించినట్లు స‌మాచారం. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మళ్ళీ ఉపాధి లభించేలా సమైక్యంగా అన్ని రాజకీయ పక్షాలు ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని ఆయ‌న సానుకూలంగా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ మాత్రం అధికారికంగా స్పందిస్తూ...తాము ప‌వ‌న్ క‌ళ్యాణ్తో క‌లిసి ముందుకు సాగ‌బోమ‌ని...న‌వంబ‌ర్ 4వ తేదీన‌...సొంతగా ఆందోళ‌న‌లు చేస్తామ‌ని వెల్ల‌డించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: