జమ్మూ కాశ్మీర్ అంటే పాకిస్థాన్ కి కి స్వర్గ‌ధామంగా కంపించేది. ఉగ్రవాదులకు అత్తారిల్లుగా ఉండేది. అదే సమయంలో భారత్ కి మాత్రం బాంబుల‌ మోతలు, తూటల గోలతో భయంకరంగా ఉండేది. కాశ్మీర్ వార్త లేని న్యూస్ లేదు, కాశ్మీర్ సమస్య ప్రస్తావించని  ప్రపంచం లేదు, కాశ్మీర్ తో ఢీ కొట్టని ప్రధాని లేడు.  దేశంలో  ఏ రాష్ట్రం తెలియకపోయినా కాశ్మీర్ అంటే ఠక్కున చెప్పే పరిస్థితి. అసలు ఇదంతా ఎందుకు. ఇంతలా కాశ్మీర్లో రక్తపాతం ఎలా జరిగిపోయింది.


చూస్తూండంగానే యాపిల్ సీమ మనకు కాకుండా పరాయిది అన్న భావన ఎలా కలిగింది. ఇదంతా రాజకీయంతోనే జరిగిందా. మందు ఎక్కడ ఉందో కనుక్కోలేకపోయారా. అవును ఇన్నాళ్ళు కాశ్మీర్ రాజకీయంలో రాజకీయమై పాలకులు అందులోనే మునిగితేలారు. పట్టుకుంటే ఏమవుతుందో, ముట్టుకుంటే ఎలా కరుస్తుందో అని అంతా లెక్కలేసుకున్నారు తప్ప కాశ్మీర్ నుదిటన తిలకం దిద్దాలనుకోలేదు. కానీ ఎట్టకేలకు మోడీ మాత్రం ధైర్యమే చేశారు. పోతే పోయింది ఏమవుతుంది అనుకున్నారేమో కానీ కాశ్మీర్ సమస్య చిక్కుముడిని విప్పేశారు.


ఆగస్ట్ 5, 6 తేదీల్లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాశ్మీర్ ని అడ్డంగా రెండు ముక్కలు చేసి పారేశారు. మొత్తం కాశ్మీర్ ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేశారు. 370 ఆర్టికల్ ని రద్దు చేసేశారు. ఇక కాశ్మీర్ మనది అన్న భావనను కలిగించారు. లడక్  ప్రాంతీయుల  కోరిక తీర్చి వారికి కేంద్ర ప్రాలిత ప్రాంతంగా చేశారు. మూడు నెలల తరువాత ఇపుడు కాశ్మీర్ అధికారికంగా   ముక్కలవుతోంది.


ఆగస్టులో 9న రాష్ట్ర విభజనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినప్పటికీ అక్టోబర్ 31 నుంచి కాశ్మీర్ రెండు ముక్కలుగా ఇకపై కనిపించనుంది.  జమ్మూ కాశ్మీర్ లడక్ మూడు ప్రాంతాలుగా ఉంటాయి. ఇప్పటికే లడక్ కి గా ఆర్ కే మాధుర్ ని తొలి లెఫ్టినెంట్  గవర్నర్ గా నియమితులయ్యారు. జమ్మూకు జీసీ ముర్మును గవర్నర్ గా పంపారు. మొత్తానికి ఈ రోజు నుంచి కొత్త కాశ్మీర్ కనిపించనుంది. దేశ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: