ఆంధ్ర ప్రదేశ్ లో  APPSC సర్వీస్‌ విభాగంలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్ష ఫలితాలను, ఆన్సర్ కీని ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ అక్టోబరు 30న విడుదల చేయడం జరిగింది.. వివరాలోకి వెళ్తే.. ఏపీలో సెరికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిర ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబరు 30న విడుదల చేయడం జరిగింది. ఇక ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా. పరీక్ష ఫలితాలతోపాటు పరీక్ష ఫైనల్ కీని కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది అని సమాచారం.


ఆంధ్ర ప్రదేశ్  లో మొత్తం 13 సెరికల్చర్ పోస్టులకు గానూ.. మొత్తం 17 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపిక అవ్వడం జరిగింది. వీరికి విజయవాడలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో డిసెంబరు 6న ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ నిర్వహించ పోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సర్టిఫికేట్ల పరిశీలన, ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అని అధికారులు తెలియచేసారు.


ఇక ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు మెమో, చెక్ లిస్ట్, అటెస్టేషన్ ఫామ్‌లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.  ఫామ్‌లను  అన్నిటిని వివరాలు 
 పూరించి ధ్రువపత్రాల పరిశీలన సమయంలో అధికారులకు ఇవ్వాలి. ఏపీ సెరికల్చర్ సర్వీస్‌ విభాగంలో ఖాళీగా ఉన్న సెరికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. మే 28, 29 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్షలు నిర్వహించింది. జులై 20న ప్రాథమిక కీని విడుదల కూడా చేయడం జరిగింది. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఆగస్టు 9న రివైజ్డ్ కీని ఏపీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. రివైజ్డ్ కీపై కూడా అభ్యంతరాలు కూడా తీసుకోవడం జరిగింది.


ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ వేదిక గురించి తెలుసుకుందామా మరి.. సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ  ఈ కింది అడ్రస్ లో జరుగుతుంది.
 అడ్రస్ 
ఆంధ్ర  ప్రదేశ్ పబ్లిక్  సర్వీస్  కమిషన్ ,
న్యూ  హె ఓ డి బిల్డింగ్ ,
2  వ అంతస్థు, M.G. రోడ్,
ఇందిరా గాంధీ  మునిసిపల్  స్టేడియం ఎదురుగా,


మరింత సమాచారం తెలుసుకోండి: