తన పార్టీ నేతలు, శ్రేణుల మీదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నమ్మకం లేదా ? ఇసుక సరఫరా లేక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కు పనవ్ పిలుపిచ్చిన విషయం తెలిసిందే.  తాము చేస్తున్న లాంగ్ మార్చ్ కు మద్దతుగా నిలవాలంటూ పవన్ తాజాగా బిజెపి, టిడిపి అధ్యక్షులకు ఫోన్లు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

 

మొన్నటి వరకూ తమకు ఎవరి మద్దతు అవసరం లేదని ఎన్నోసార్లు పవన్  చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.  తాను రోడ్ల మీదకొసైతే లక్షలాదిమంది అభిమానులు వచ్చేస్తారంటూ చాలా గొప్పగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇపుడు భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా చేస్తున్న లాంగ్ మార్చ్ లో పాల్గొనాలంటూ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఎందుకు ఫోన్ చేసినట్లు ?

 

అంటే జనసైనికులు కానీ అభిమానులు కానీ తాను ఆశించిన స్ధాయిలో పాల్గొనరేమో అన్న అనుమానం పవన్ లో మొదలైందా ? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇసుక లభ్యత లేకపోవటంతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్న మాట నిజమే. అయితే  ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా ఆరోపిస్తున్న స్ధాయిలో సమస్య అయితే లేదు.

 

ఇసుక సరఫరాకు ప్రధాన అవరోధం బారీ వర్షాలే అన్న విషయం అందరికీ తెలిసిందే. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో నిర్మాణాలు జరగవన్న సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదు మాసాల్లో సుమారుగా 90 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల నదులు, వంకలు, వాగులు, కాలువల్లో తీయాల్సిన ఇసుక తీయలేకపోతున్నారు.  ఈ విషయం అందరికీ తెలిసినా ప్రతిపక్షాలు కాబట్టి, ఎల్లోమీడియా కాబట్టే జగన్ కు వ్యతిరేకంగా కథనాలు, వార్తలు అచ్చేసొదులుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: