ఇడ్లీ, దోసె, మజ్జిగ ఈ మూడింటి వలన మన శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇడ్లీ, దోసె, మజ్జిగ మన శరీరానికి వచ్చే చాలా జబ్బులను నయం చేస్తాయి. ఈ మూడింటిలో జీర్ణవ్యవస్థకు మేలు చేసే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ప్రో బయోటిక్స్ అని పిలవబడే ఈ బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా ఏవైనా వ్యాధులు వస్తే వైద్యులు కొన్ని మందులను ఇస్తారు. 
 
ఈ మందులు మనకు హాని చేసే బ్యాక్టీరియాతో పాటు మేలు చేసే బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. మన శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా చనిపోవటం వలన డయేరియా, మజిల్ క్రాంప్స్, కడుపులో గ్యాస్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇడ్లీ, దోసె, మజ్జిగ ద్వారా మన శరీరంలో చేరే బ్యాక్టీరియా శరీరానికి అవసరమైన కొన్ని విటమిన్లను కూడా అందేలా చేస్తుంది. మన శరీరంలోని జీర్ణవ్యవస్థ, గొంతు, చర్మం, నోట్లో కోట్ల సంఖ్యలో సూక్ష్మ జీవులు ఉంటాయి 
 
జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మ జీవులలోని బ్యాక్టీరియా మనం తినే ఆహారం జీర్ణం కావటానికి మరియు కొన్ని వ్యాధుల నుండి రక్షించటానికి ఉపయోగపడుతుంది. ఇడ్లీ, దోసె, మజ్జిగ తీసుకోవటం వలన మన శరీరానికి మనకు తెలియకుండానే రోగనిరోధకశక్తి పెరిగేలా చేస్తున్నాం. ఇడ్లీ, దోసె పిండిని పిండి పులిసే వరకు ఉంచి ఇడ్లీ, దోసెలు చేసుకుంటాం కాబట్టి పిండి పులిసే సమయంలో ఇడ్లీ, దోసె పిండిలో చేరే మేలు చేసే బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. 
 
ఇడ్లీ, దోసె, మజ్జిగ తీసుకోవటం ద్వారా మన శరీరంలో చేరే బ్యాక్టీరియా విరేచనాల్ని తగ్గిస్తుంది. విరేచనాలకు సంబంధించిన అన్ని సమస్యలకు ఇడ్లీ, దోసె, మజ్జిగ ద్వారా చేరే బ్యాక్టీరియా మందులా పని చేస్తుంది. క్రోన్స్ డిసీజ్ ఉన్నవారికి మరియు కడుపులో మంటలాంటి లక్షణాలు ఉన్నవారికి కూడా ఇడ్లీ, దోసె, మజ్జిగ ద్వారా శరీరంలో చేరే ప్రో బయోటిక్స్ ఎంతో మేలు చేస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: