జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బిజెపి షాక్ ఇచ్చింది. నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే లాంగ్ మార్చ్ లో తము పాల్గొనేది లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి స్పష్టంగా చెప్పేశారు. ఇసుక సరఫరా విషయంలో  భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో లాంగ్ మార్చ్ చేయాలని పవన్ కల్యాణ్ డిసైడ్ చేశారు. నిరసన కార్యక్రమంలో తనకు మద్దతు ఇవ్వాలంటూ బిజెపి, టిడిపి అధ్యక్షులకు పవన్ ఫోన్ చేశారు.

 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో ఫోన్లో పవన్ మాట్లాడారు.  తర్వాత ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పవన్ ఆహ్వానానికి కన్నా సానుకూలంగా స్పందించారంటూ అందులో స్పష్టంగా చెప్పారు. అయితే ప్రెస్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే బిజెపిప్రెస్ రిలీజ్ ను ఖండించింది. పవన్ ఆహ్వానించినా తాము మాత్రం లాంగ్ మార్చ్ లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పేసింది బిజెపి.


సమస్యలకు సాంఘిభావం తెలుపుతామే కానీ పార్టీలకు కాదంటూ విష్ణు ఇచ్చిన క్లారిటితో పవన్ కు షాక్ కొట్టినట్లైంది. తాను చేయబోతున్న లాంగ్ మార్చ్ కు ప్రతిపక్షాలన్నీ పూర్తిస్ధాయిలో మద్దతు తెలుపుతాయని పవన్ అనుకున్నారు. ఎలాగూ వామపక్షాలు, బిఎస్పీ జనసేనకు మిత్రపక్షాలే కాబట్టి మిగిలిన పార్టీలు కూడా కలిసి వస్తాయనే అనుకున్నారు.

 

కానీ పవన్ ఒకటనుకుంటే బిజెపి మరోటి చేసింది. జనసేనకు తమ మద్దతుండదని చెప్పేసింది. ఇక తేలాల్సింది తెలుగుదేశంపార్టీ స్టాండ్ మాత్రమే. ఇప్పటికే చంద్రబాబునాయుడు-పవన్ ఒకటే అనే ప్రచారం ఎక్కువగా ఉంది. అందులోను చంద్రబాబుకు ఫోన్ చేసిన పవన్ చాలాసేపు మాట్లాడారట. మరి అంతసేపు ఫోన్లో ఏమి మాట్లాడుకున్నారో ఇప్పటికైతే బయటకు పొక్కలేదు. లాంగ్ మార్చ్ లో జనసేనకు మద్దతిస్తే మొత్తం మైలేజ్ అంతా పవన్ కే వెళుతుంది కాబట్టి అందులో పాల్గొనక్కర్లేదని కొందరు తమ్ముళ్ళు చంద్రబాబుకు సూచించారని సమాచారం. మరి చంద్రబాబు ఏమి డిసైడ్ చేస్తారో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: