దీపావళి పండుగ రోజున తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ రాసిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ రాజకీయాలకు కూడా దూరమవుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఇన్నాళ్లు పని చేశానని తన ఆవేదనను అర్థం చేసుకొని అండగా ఉంటానని చెప్పిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన వంశీ వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. 
 
కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వల్లభనేని వంశీ కలిశారు. జగన్ ను కలిసిన రెండు రోజుల తరువాత పార్టీ, ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా చేశారు. అధికారం, పదవుల కొరకు వైసీపీ పార్టీలో చేరటం లేదని తనను కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకొనే అనుచరుల కోసం మాత్రమే పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నాని వల్లభనేని వంశీ చెప్పారు. 
 
నవంబర్ నెల 3వ తేదీ లేదా 4వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో వంశీ చేరనున్నారు. స్వయంగా వంశీ వైసీపీ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించటంతో ఉత్కంఠకు తెరపడింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీల నుండి వైసీపీ పార్టీలో చేరేవారు పదవికి రాజీనామా చేయాల్సిందేనని గతంలో ప్రకటన చేశారు. ఈ ప్రకటన వలన టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలనే ఆలోచన ఉన్నా చేరలేదు. 
 
వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో సీఎం జగన్ వైసీపీ పార్టీలో చేరే అవకాశం కల్పించారు. రాజకీయాలకు దూరమవుతానని ప్రకటించిన వల్లభనేని వంశీ వైసీపీ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకోవటంతో టీడీపీ నేతలు, కార్యకర్తల నుండి విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత చంద్రబాబు నాయుడు ఎంపీ కేశినేని నాని మరియు కొనకళ్ల నారాయణను పంపి బుజ్జగించమని చెప్పారు. కానీ చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: