దాయాది దేశమైన పాకిస్థాన్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో 42 మంది అక్కడిక్కడే మృతి చెందగా..మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ప్రమాదానికి కారణం రైల్లో సిలిండర్   పేలడం అని భావిస్తున్నారు. కరాచీ నుంచి లాహోర్ కి వెళ్తున్న రైలు లో ఈ ఘటన జరిగింది. 

తల్వారీ రైల్వే స్టేషన్ దాటిన తర్వతా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.  రైలు లోని వంటగదిలో ఉన్న సిలీండర్ పేలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఒక్కసారే సిలీండర్ పేలిపోవడంతో పెద్ద బాంబు శబ్దంలా వినిపించిందని బాధితులు చెబుతున్నారు.  తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు..42 మంది మృతి 36 మందికి తీవ్ర గాయాలు. 

సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఒక్కసారిగా బోగీలకు వ్యాపించాయి..దీంతో ప్రాణ నష్టం భారీ స్థాయిలో సంబవించింది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి పరిస్థితులపు బట్టి తెలుస్తుంది.  ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు వెళ్లి క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: