ప్రధాని నరేంద్ర మోదీ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని ఐక్యతా విగ్రహాన్ని సందర్శించి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులు అర్పించారు. ఆ తరువాత మోదీ ఏక్ తా దివాస్ పరేడ్ లో పాల్గొని ప్రసంగించారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. వైవిధ్యత, ఐక్యతలో భారత్ ఎప్పుడూ రాజీ పడలేదని భారత సమగ్రతకు పటేల్ విగ్రహం చిహ్నం అని మోదీ అన్నారు. 
 
పటేల్ వ్యక్తిత్వం మానవాళికి ఒక పవిత్రమైన సందేశం అని మోదీ అన్నారు. ఐక్యతను కొనసాగించటం భారత్ కు సవాలుగా మారిందని ఈ సవాల్ ను మనమంతా స్వీకరించి ఐక్యతను నిలబెడతామన్న నమ్మకం ఉందని మోదీ అన్నారు. సంప్రదాయాలు, వేషభాషలు, విభిన్న సంస్కృతి మన దేశానికే ప్రత్యేకమని మోదీ అన్నారు. సర్దార్ వలాభాయ్ పటేల్ మార్గదర్శకాలను అనుసరించాలని మోదీ అన్నారు. 
 
యుద్ధాలు చేసి గెలవలేని వారు మాత్రమే మన ఐక్యతను విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పటేల్ వంటి మహనీయులను స్పూర్తిగా తీసుకొని కుటిల యత్నాలు చేసే వారికి తగిన బుద్ధి చెప్పాలని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదం కారణంగా గత మూడు దశాబ్దాల్లో 40,000 మంది ప్రాణాలు కోల్పోయారని మోదీ అన్నారు. భారదేశంలోని జమ్మూకశ్మీర్ లో మాత్రమే ఆర్టికల్ 370 ఉండేదని మోదీ అన్నారు. 
 
ఉగ్రవాదం కారణంగా దేశంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారని అందువలనే బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిందని మోదీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సర్దార్ వల్లాభాయ్ పటేల్ కు అంకితమిస్తున్నానని మోదీ అన్నారు. పటేల్ కల కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి తొలగించటం వలన నెరవేరినట్లయిందని మోదీ అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా జమ్మూకశ్మీర్ లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని మోదీ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: