గత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరాల్లో గుంతల రోడ్లలో నీళ్లు నిలువ కారణంగా దోమల కాటుకు, యాక్సిడెంట్లకు తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలు.. పల్లెలలో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. నగరాల్లో వారికీ దోమ కాటు ప్రమాదం అయితే ఈ భారీ వర్షాల కారణంగా పంటలు నాశనమయ్యి తీవ్రనష్టాలకు ప్రజలు గురవుతున్నారు. 

            

అయితే ఇప్పుడు వాతావర్ణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అయితే మత్సకారులను చేపల వేటకు వెళ్లొద్దు అని హెచ్చరించారు. మరో రెండు రోజుల పాటు తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు లో ఈ మహా తుపాన్ రానుంది అని వాతావర్ణ శాఖ హై అలెర్ట్ ప్రకటించింది. 

               

అరేబి సంద్రంలో అల్పపీడనం కారణంగా కేరళలో 4 జిల్లాల్లో హై అలెర్ట్ అని ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కాగా మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కన్యాకుమారి, తూత్తుకుడి, విరుదునగర్ జిల్లాల్లో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అయితే కేరళ, తమిళనాడుకు మరో 24 గంటల్లో మహా తుఫాన్ ముప్పు ఉంది. 


కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: