టీడీపీ  కీలక నేత వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఉన్నట్టుండి సడన్ గా  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేయడం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వంశీ టిడిపి సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసిపి గూటికి చేరనున్నారు అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు వల్లభనేని వంశీ మాత్రం ... ఏ పార్టీలో చేరలేదు. అటు బిజెపి లో కూడా వల్లభనేని వంశీ చేరుతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి  టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేయడంతో టీడీపీకి భారీ షాక్ తగిలినట్లయింది. 



 పార్టీ కీలక నేతగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అకస్మాత్తుగా పార్టీకి  రాజీనామా చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీతో టీడీపీ ఎంపీ కేశినేని నాని చర్చించారు.అనంతరం  కేసినేని ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ... రాజకీయంగా రాటు తేలడానికి పోరాడాల్సి ఉంటుందని... ఎన్నో ఒత్తిళ్లను  ఎదుర్కోవడం సహజం  అని ఆయన వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ పోరాడి గెలిచిన వల్లభనేని వంశీ ఇప్పుడు వెన్ను  చూపడం సరికాదని ఎంపీ కేశినేని నాని అన్నారు. వల్లభనేని వంశీకి తాము చెప్పాల్సింది చెప్పామని ఇక తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపారు కేశినేని నాని. 



 
 అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసినప్పటికీ.. ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని కేశినేని నాని తెలిపారు. కాగా వల్లభనేని వంశీ తుది  నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పిన కేశినేని నాని... వంశీకి టిడిపి పార్టీ ఎంత అవసరమో టీడీపీ కూడా వంశీ అంతే అవసరమని వ్యాఖ్యానించారు. కాగా నవంబర్ 3న జగన్ సమక్షంలో వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. ఒకవేళ వల్లభనేని వంశీ వైసీపీ పార్టీలో చేరితే జగన్ కు ప్లస్ పాయింట్ గా మారనుంది . వల్లభనేని వంశీ లాంటి కీలక నేత వైసీపీ లో చేరడం వల్ల చంద్రబాబును జగన్ ప్రభుత్వం మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: