తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సమ్మె  ఇరవై ఏడు రోజులకు చేరుకున్నప్పటి కూడా...  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం విషయంలో మొండి పట్టు వీడలేదు. సమ్మె ఉధృతం అవుతున్నకొద్దీ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికలను  అందరిని  ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్టు  సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్... ఇక తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సమ్మె పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఒక బుద్ధి లేని పని... సమ్మె చట్ట విరుద్ధమైనదని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉందని చెబుతున్న ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ  సంస్థకు లాభాలు చేకూర్చే టైంలో సమ్మె చేపట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇక సమ్మె ముగింపు కాదు ఆర్టీసీ సంస్థ ముగింపు అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 



 ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామంటూ తీసుకున్న నిర్ణయంపై కూడా కామెంట్ చేశారు. ఏపీ లో ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం  అంశం ఇంకా ఏమీ జరగలేదని అక్కడ కేవలం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాని నివేదిక అందించాలని  ఓ కమిటీని మాత్రమే వేశారని సీఎం కేసీఆర్ సెటైర్  వేశారు . అయితే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగులకు బాగా కలిసి వచ్చాయనే   చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నవంబర్ రెండో వారం నాటికి ఆర్టీసీపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన  ఆంజనేయరెడ్డి కమిటీని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. 



 అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రక్రియను ఇంత తొందరగా చేస్తారని ఎవరు భావించలేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్స్ వల్ల ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఇదీ వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్ మాటకు పరీక్ష అని భావించిన  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఏపీ ప్రభుత్వంని ఎంతలా  ప్రభావితం చేసాయంటే ... కెసిఆర్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించి... కెసిఆర్ వ్యాఖ్యలతో  తమకు మరింత కసి పెరిగిందని చెప్పే అంతగా ప్రభావితం చేసాయి. దీంతో కెసిఆర్ తెలంగాణ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఆది కాస్త తమకు వరంలా  మారిందని ఏపీ ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: