నిరసనలు నినాదాలతో మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె నేడు చిలికి చిలికి గాలివానగా మారింది నిన్నటి రోజున  కరీంనగర్ డిపో(2) చెందిన బాబు  మరణం ఆర్టీసీ కార్మికుల హృదయాన్ని కలచి వేయడం జరిగింది. వారి పట్ల ప్రభుత్వం వైఖరిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.  


వివరాల్లోకెళ్తే పెద్దపల్లి జిల్లా మంథని ఆర్టీసి డిపో ఎదుట ఈరోజు ఉదయం ఆర్టీసీ కార్మికులు ధర్నా కి దిగి, వారి డిమాండ్లకు ప్రభుత్వం దిగి రావాలని నినాదాలు చేస్తూ ఉండగా,   ఆర్టీసీ కార్మికుడు అయినా కొండల్రెడ్డి పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. ఇది గమనించిన తోటి కార్మికులు హుటాహుటిన పెట్రోల్ బాటిల్ ను కొండల్ రెడ్డి దగ్గర నుండి లాక్కుని పక్కకు పడవేశారూ.  


ఈ సంఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు  కొండల్ రెడ్డిని దగ్గరకు తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే కొండల్ రెడ్డి మాత్రం   కరీంనగర్ (2) డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికుడు బాబు, గుండెపోటుతో మరణించడం తనను ఎంతో కలిచి వేసిందని తనతో సంస్థలో పనిచేస్తున్న తోటి కార్మికులు  ఆత్మహత్యలు చేసుకోవడం బాధ కలిగించిందని, నా భార్య పిల్లల కన్నా 50 వేల మంది కార్మికులు తనకు ముఖ్యమని తన ఆవేదన వ్యక్తం చేశాడు.


 కనీసం తన ఆత్మహత్యతోనైనా ప్రభుత్వం దిగి వచ్చి డిమాండ్లను అంగీకరించినట్లయితే తోటి ఉద్యోగుల ఇబ్బందులు తొలగిపోతాయని, భావించినట్లు వెల్లడించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం అని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉంటే కార్మికులకు ఈ విధంగా ప్రాణాలు ఫణంగా పెట్టి, ఉద్యమాలు చేసే దుస్థితి నెలకొని ఉండక పోయి ఉండేది అని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు


మరింత సమాచారం తెలుసుకోండి: