ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా పదేళ్లపాటు కొనసాగిన నరసింహాన్ ఇటీవల పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.  ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ నియమితులయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటి మహిళా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విశేషం.  తాజాగా జాగృతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌ నిర్వహించిన మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమ ముగింపు వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మరో మూడు నెలల్లో పూర్తిగా తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 

ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు.  మగవాళ్లతో సరిసమానంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. అయితే ప్రతి మహిళా ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని తమిళిసై సూచించారు.  ఆర్థిక స్వాతంత్రం సాధించడం కూడా మహిళలకు ఎంతో అవసరమని గవర్నర్‌ పేర్కొన్నారు. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి  రెండోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో తమిళిసై సౌందర రాజన్  కేంద్రం తెలంగాణ గవర్నర్ గా నియమించింది. 

కాగా, గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తానని ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల  ఇప్పటి వరకు అది ప్రారంభించలేదు.   ఇటీవలే గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమైన ఆమె గిరిజనులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.  ఈ కార్యక్రమంలో బండారు లక్ష్మన్ పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఆమె ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ముద్ర రుణాలు తీసుకోవచ్చునని లక్ష్మణ్ తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: