ఇప్పటి వరుకు ఒక లెక్క.. ఇక మీద ఒక లెక్క అన్నటు ప్రవర్తిస్తుంది కేంద్రం. సంచలన నిర్ణయాల మీద నిర్ణయాలు తీసుకుంటూ.. ముందుకు నడుస్తుంది. మొన్నటికి మొన్న బ్యాంకుల విలీనం.. నిన్నటికీ నిన్న ఎక్కువ బంగారం ఉన్నవారు పన్ను కట్టెల సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇంకా ఈరోజు అబ్బయిల పెళ్లి వయసు భారీగా తగ్గించేసింది. 


ఇప్పటి వరుకు మన దేశం అమ్మాయిలు 18 ఏళ్ళు, అబ్బాయిలు 21 ఏళ్ళు దాటితే పెళ్లి చేసుకోడానికి అర్హులు. ఇప్పుడు వేరు వేరు వయసు ఉంది. అయితే ఇప్పడు మాత్రం ఇద్దరికి వయసు వ్యత్యాసం లేకుండా సమానం చేసే దిశాగా కేంద్రం అడుగులు వేస్తుంది. అమ్మాయి వయసు పెంచలేదు.. అబ్బాయి వయసే 18కి చేసే ఆలోచనలో ఉంది. ఇక అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా 18 ఏళ్ళు నిండితే చాలు పెళ్లి చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తుంది.  


బాల్య వివాహ నిషేధ చట్టంలో ఈ సవరణపై ఈ మధ్య నిర్వహించిన వివిధ మంత్రిత్వ శాఖల అంతర్గత సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పురుషులు, మహిళల పెళ్లి అర్హత వయసును సమానం చేసేందుకు వివిధ వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించామని బుధవారం కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్‌ ఆగస్టులో పురుషులు, మహిళల వివాహ వయసు ఒకేలా ఉండాలంటూ పిటిషన్ వేశారు. 


దీంతో ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు బాల్య వివాహ నిషేధ చట్టంలో ఈ సవరణ దిశగా అడుగులు వేస్తుంది. బాల్య వివాహ నిషేధ చట్టానికి సవరణ తీసుకొచ్చేనందుకు మహిళా శిశు అభివృద్ధి శాఖ సంప్రదింపులు మొదలుపెట్టిందని కోర్టుకు కేంద్రం తరఫు న్యాయవాది తెలిపారు. అయితే ఈ చట్టానికి సంబంధించి తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: