ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగంన్మోహాన్ రెడ్డి ఎదుర్కొంటున్న అక్రమాస్తుల కేసు మరో మలుపు తిరిగింది. ఈ  కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ సి వి ఎస్ కె శర్మ పై తాజాగా హైదరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నుండి న్యాయ సహాయం పొందిన ఆయన నకిలీ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు పొందారంటూ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. బిల్లుల విడుదల విషయంలో శర్మకు మాజీ సీఎస్ పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పి. వి. రమేష్ సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ అక్రమాస్తుల కేసులో  ఏడుగురు ఐఏఎస్ అధికారులు  ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ అధికారులకు అప్పటి ప్రభుత్వం న్యాయ సహాయానికి నిధులు విడుదల చేసింది. అప్పటి ప్రభుత్వ హయాంలో  సి వి ఎస్ కె శర్మ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా  వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి న్యాయ సహాయ బిల్లులు అందజేయడంలో ఆ అధికారి చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణ వచ్చాయి. ఆ సమయంలో శర్మ తప్పుడు బిల్లులతో లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్టు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందాయి. 



శర్మ పెట్టినబిల్స్ ను  సరిగ్గా పరిశీలించకుండానే ఆనాటి సిసిఎస్ పీకే మహంతి సంతకాలు చేశారని ఫిర్యాదారుడు పి.వి. రమణ అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి టి వి రమేష్ నిధులు విడుదల చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పై కేసు నమోదు చేయాలని రమణ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు  సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి జగన్ అక్రమాస్తుల కేసుల్లో పలువురు ఐఏఎస్ అధికారులపై ఉన్న కేసులను కోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే.  ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని అప్పట్లో సీబీఐని కోర్టు ఆదేశించిన విషయం కూడా విదితమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: