ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా  హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ రద్దును సవాల్ చేస్తూ నవయుడా సంస్ద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై గతంలో ఇచ్చిన స్టేని హైకోర్టు ఎత్తివేసింది. 

      

దీంతో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ విచారణ ముగించింది. కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకొనేందుకు అనుమతిని ఇస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవలే పోలవరంపై సీఎం జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించినందుకు రూ. 850 కోట్లు ఆదా అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నవయుగ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. 

           

అయితే ఈ రద్దును సవాల్‌ చేస్తూ నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ హైకోర్టుని ఆశ్రయించింది. దీంతో సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చెయ్యగా ఈ పిటిషన్ పై మంగళవారం వాద ప్రతివాదనలు ముగిశాయి. వారు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, కారణం లేకుండా కాంట్రాక్టును ఎలా రద్దు చేస్తారని నవయుగ సంస్థ తరపు అడ్వకేట్స్ ప్రశ్నించారు.

     

అయితే చివరికి హైకోర్టు తీర్పుతో పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు పనులకు అడ్డంకి తొలిగిపోయింది. ఈ విచారణలో భాగంగా న్యాయస్థానం మధ్యంతర స్టే విధించింది. ఇప్పుడు ఆ స్టే ఎత్తివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి పునః ప్రారంభం కానున్నాయి. ఏది ఏమైనా జగన్ సర్కార్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: