టిడిపి నేత బుద్ధా వెంకన్న మరోసారి ట్విట్టర్ వేదికగా పదునైన విమర్శలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి,  ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్ చేసి ఘాటు విమర్శలు చేశారు టిడిపి నేత బుద్ధా వెంకన్న. ఓవైపు రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రరూపం దాల్చి భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతుంటే... ఇంట్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ... నెట్ ఫ్లిక్స్ లో  సినిమాలు చూస్తూ నిద్రపోతున్న మీ తింగరి మాలకొండ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ని  నిద్రలేపండి విజయసాయి రెడ్డి గారు అంటూ  టిడిపి నేత బుద్ధ వెంకన్న ట్విట్టర్ వేదికగా ఘాటుగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని నిద్రలేపి ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తు చేయండి విజయసాయి రెడ్డి గారు అంటూ వ్యాగ్యాంగా  విమర్శలు చేశారు బుద్ధ వెంకన్న. 



 సీఎం జగన్  రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అని చెబుతూనే ... 1300 కోట్ల రూపాయలతో స్మశానాలు కూడా రంగులు వేయిస్తున్న  వాళ్ళని ఏమనాలి అంటూ బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్న జగన్ ను  తింగరి మాలోకం అనకుండా  ఇంకేం అని పిలవాలి అంటూ  బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. దొంగ దీక్షలు చేయడం విషయంలో మీ తింగరి మాలోకం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి  పి.హెచ్.డి వచ్చిన విషయం అందరికీ తెలిసినదే అంటూ బుద్ధా వెంకన్న హితవు పలికారు.
 ప్రత్యేక బస్సులో దొంగ నేతలు... సొంత డబ్బా లో గ్రాఫిక్స్ మనుషులు ఇవన్నీ నిజాలు  రాష్ట్ర ప్రజలకు తెలుసునని బుద్ధ వెంకన్న విమర్శించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర గురించి చెప్పాలంటే... అదొక భరించరానంత అద్భుతం అంటూ ఎద్దేవా చేశారు బుద్ధ వెంకన్న. 



 రోజుకు మూడు కిలోమీటర్లు నడవడం.... వారానికి రెండు రోజులు అక్రమ కేసులు పేరుతో లోటస్ పాండ్ లో  విలాసంగా గడపడం ఇదంతా అందరికీ తెలుసునని బుద్ధ వెంకన్న విమర్శించారు. అందరికీ తెలుసు మీరు దొంగ దీక్షలకు పేటెంట్ అన్న సంగతి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు బుద్ధ వెంకన్న. అయితే రాష్ట్రంలో రోజురోజుకు ఇసుక కొరత తీవ్రం అవుతున్న  నేపథ్యంలో... నిన్న టిడిపి నేత మాజీ మంత్రి నారా లోకేష్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేతలు నారా లోకేష్ ఇసుక కొరత సమస్యను తీర్చమని ఒకరోజు దీక్ష చేయలేదని.. డైటింగ్ కోసమే దీక్ష చేసారూ  అంటూ విమర్శించారు. నారా లోకేష్ చేపట్టిన దీక్షపై వైసీపీ నేతలు విమర్శించిన నేపథ్యంలో తాజాగా బుద్ధ వెంకన్న ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: