రత్నాలు రాసులుగా పోసి అమ్ముకునే కాలం పోయి.... ఇలా ఇసుకను అమ్ముకునే దుస్థితి వచ్చిందని.... గత కొద్దీ రోజులుగా ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక కొరత ఉండటంతో అందరు ఇది నిజమే అని నమ్మేస్తున్నారు. కానీ ఈ ఫోటో వెనక ఉన్న అసలు కథ ఏంటో తెలుసా?ఇక్కడ అమ్ముతుంది ఇసుక కాదు గొలుసు అంటారు. అంత క్లియర్ గా ఇసుక కనిపిస్తుంటే గొలుసంటారేంటీ అంటారా? ఐతే పూర్తిగా చదవండి.


తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పరిధిలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం లోని ఇసుకను డబ్బాలు చొప్పున అమ్ముతున్న దృశ్యం ఇది.దీపావళి నుండి కార్తీక పౌర్ణమి దాకా కేదారేశ్వర స్వామి నోములు వ్రతాలు, నోములు జరుపుకోవటం అందరికి తెలిసిందె.కానీ  ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఒక  ఆనవాయితి ఉంది. అదేంటంటే....  కేదారేశ్వర స్వామి నోములు,  వ్రతంలో భాగంగా పవిత్రమైన నోము పాత్రలను ఇసుక పై ఉంచుతారు. పవిత్ర  గోదావరి నదిలో  అడుగున ఉండే ఇసుకనే గొలుసు అంటారు. ఏడాది పాటు అత్యంత పవిత్రంగా ఉత్తి మీద ఉంచే నోము కుండలను కిందికి దింపి గొలుసు పైనే ఉంచుతారు, తప్పితే కింద పెట్టారు అది ఇక్కడి సాంప్రదాయం.


గోదావరి పరివాహక గోదావరి పరివాహక ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లోని జనం గోదావరి ప్రవాహం లోని ఇసుక నోము నోచుకునే రోజు ఉదయాన్నే నదీ స్నానమాచరించి గొలుసుని తీసుకొచ్చి పేర్చుతారు.అయితే ఇప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టు కారణంగా కాలేశ్వరం నుంచి మొదలుకొని ఎగువన గోదావరిఖని, శ్రీపాద సాగర్ ప్రాజెక్టు గోదావరి నిండుగా ఉంది.గతంలో అయితే ఈ సమయంలో పాయలు పాయలుగా ప్రవాహం ఉండేది. కాబట్టి సులువుగా గొలుసు (పవిత్రమైన ఇసుకని) తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా గోదావరి నిండిపోవడంతో భక్తులకు గొలుసు తీసుకోవడం వీలుపడట్లేదు.


ఈ సంగతి తెలిసిన ఆవల మంచిర్యాల జిల్లా, మహారాష్ట్ర కు చెందిన కొందరు అక్కడ ఇసుకను తీసుకొచ్చి కోసం పది రూపాయలు చొప్పున అమ్ముతున్నారు.ఆ గొలుసు ప్రాధాన్యం తెలిసి నోము నోచుకునే వారు ఆ ఇసుకను తీసుకెళ్లారు. ఇలా గొలుసు అమ్మే దృశ్యం కార్తీక పౌర్ణమి వరకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ పవిత్రమైన ఇసుక అవసరం ఎవరికీ ఉండదు. కానీ ఒక్క ఫొటోతో అనేక కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సోషల్ మీడియా లో కనిపించే ప్రతిదానికి ప్రతిస్పందించే ముందు ఆలోచించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: