రాజకీయాల్లో శాశ్వత శత్రువులు...శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఈ మాట టీడీపీ అధినేత చంద్రబాబుని చూసే పుట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆయనకు అవకాశవాద రాజకీయాలు చూస్తే...ఇలా కూడా చేయొచ్చ అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది. అసలు తమకు ఏ పార్టీ అయిన శత్రువుగా ఉంటే...ఆ పార్టీపై బాబు చేసే విమర్శలు మామూలుగా ఉండవు. కానీ అంత తిట్టిన మళ్ళీ అదే పార్టీతో బాబు స్నేహం చేసేస్తారు. దానికి ఉదాహరణే చంద్రబాబు-బీజేపీల మధ్య ఉన్న బంధం.


2004 వరకు బీజేపీతో స్నేహం చేసిన బాబు..ఆ తర్వాత బీజేపీని వదిలేశారు. ఇక మళ్ళీ 2014లో బీజేపీతో పొత్తుకు పెట్టుకున్నారు.  అలాగే పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచి మూడో సారి సీఎం కూడా అయ్యారు. మళ్ళీ నాలుగు సంవత్సరాల్లో తెగదెంపులు చేసేసుకున్నారు. ఇక అక్కడ నుంచి బాబు బీజేపీ మీద చేసిన విమర్శలు అన్నీ,ఇన్నీ కాదు. బాబు చేసిన విమర్శల వల్లే ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే బీజేపీని అడ్డుకుంటానికి బాబు...ఆఖరికి తన చిరకాల శత్రువు కాంగ్రెస్ తో కూడా కలిశారు.


అయినా కేంద్రంలో బీజేపీని నిలువరించలేకపోయారు. రెండో సారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ మళ్ళీ ప్రధాని అయ్యారు. ఇక ఇటు ఏపీలో బాబు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. అక్కడ నుంచి బాబు మనసు మళ్ళీ బీజేపీ వైపు మళ్లినట్లు కనబడుతుంది. అందుకే తమ పార్టీ నేతలు చాలామంది బీజేపీలోకి వెళ్ళిన బాబు మెదలకుండానే ఉన్నారు. ఈ తరుణంలోనే బాబు జ్ఞానోదయం మాటలు మాట్లాడారు. బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకోవడం వల్లే నష్టపోయామని మాట్లాడారు.


దీంతో బాబు మళ్ళీ బీజేపీకి దగ్గరవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. కానీ బీజేపీ నేతలు మాత్రం బాబుకు గేట్లు మూసేశామని ప్రకటనలు చేశారు. ఈ క్రమంలోనే బాబు సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చారు. బీజేపీకి దగ్గర చేరేందుకు... ఆ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ అయినట్లు తెలిసింది. నాగపూర్ వెళ్లి చంద్రబాబు రాష్ట్రీయ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో భగవత్‌తో సమావేశమైనట్లు సంచారం.


అయితే వీరిద్దరి భేటీకి సంబంధించి విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. ఇక వీరి భేటీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాయబారం చేసినట్లు వార్తలు వచ్చాయి. మొత్తానికి బాబు బీజేపీకి దగ్గరవ్వడానికి ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే బాబు ఖాతాలో మ‌రో యూట‌ర్న్ ప‌డిన‌ట్టే అనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: