ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నారా లోకేశ్ ట్విట్టర్ కే పరిమితమైన విషయం తెలిసిందే. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన లోకేశ్, ఘోరంగా ఓడిపోయారు. మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం చెందారు. అటు టీడీపీ కూడా 23 సీట్లకే పరిమితమైంది. ఈ తరుణంలో లోకేశ్ పెద్దగా బయటకు రాలేదు. కేవలం ట్విట్టర్ లోనే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రతి రోజు వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు, పలు సమస్యలపై ట్విట్టర్ వేదికగానే స్పందిస్తూ వచ్చారు.


కానీ టీడీపీకి భవిష్యత్ నాయకుడుగా ఎదగాల్సిన లోకేశ్....ట్విట్టర్ కే పరిమితం కావడంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఉంటే కనీసం మద్ధతు దొరుకుతుందని అనుకుంటున్నారు. ఈ తరుణంలోనే లోకేశ్ గత నాలుగు రోజులుగా ట్విట్టర్ దాటి బయటకొచ్చారు. మొదట మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమవ్వడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఇసుక సమస్యపై ఒకరోజు నిరాహార దీక్ష చేశారు.


అలాగే తాజాగా జైలులో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలిసి పరామర్శించారు. మీడియా సమావేశం పెట్టి వైసీపీపై విమర్శలు చేశారు. అయితే లోకేశ్ ఇక నుంచైనా ప్రజల మధ్య తిరిగితే నాయకుడుగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఓ నాలుగు రోజులు హడావిడి చేసి మళ్ళీ ట్విట్టర్ గూటికి చేరిపోతే అంతే సంగతులు. ప్రస్తుతానికైతే ప్రజల్లో లోకేశ్ మీద అంత పాజిటివ్ అభిప్రాయాలు ఏమి లేవు.


ఓ రకంగా ఆయన రాజకీయాలకు పనికిరాడని కొందరి చర్చలు చేసుకుంటున్నారు.  ఇలాంటి తరుణంలో లోకేశ్ తనని తాను రుజువు చేసుకోవాలి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నాయకుడుగా ఎదగడానికి ఇదే సరైన అవకాశం. కాకపోతే జగన్ లాగా లోకేశ్ తక్కువ సమయంలో ఓ పవర్ ఫుల్ నాయకుడుగా ఎదగడం అసాధ్యమైన పని.


మరింత సమాచారం తెలుసుకోండి: