పండగ వేళా షాపింగ్ మాల్స్ లో సాధారణంగా వివిధ ఆఫర్స్ తో మరియు డిస్కౌంట్స్ తో  ఆకట్టుకునే ప్రయత్నం చేయడం మాములే అలాగే వినియోగదారులు  కూడా  విపరీతంగా ఖర్చు చేసి అవసరం ఉన్నవి అవసరం లేనివి అంటూ చూడకుండా కొనిస్తుంటారు.  మరి పేదవారు పండగలను ఎలా జరుపుకుంటారు వారు షాపింగ్ ఎలా చేస్తారు అని ఆలోచించిన ఒక వ్యాపారి ఆనంద్ చెన్నై లో  అతని బట్టల దుకాణం లోని అన్ని బట్టలను పది రూపాయలకే విక్రయంచాడు.

టీషీర్ట్స్, షర్ట్స్ తదితర వస్త్రాలు పదిరూపాయలకే విక్రయంచాడు మొదటగా 50 మందికే ఇస్తా అని టోకెన్ ఇచ్చిన ఆనంద్ పేద ప్రజల ను చూసి అది 200 మంది పేదప్రజలకు  అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా వరం రోజులు విక్రయంచాడు. అక్కడి వ్యాపారస్తులు మరియు మీడియా వారు అడిగిన ప్రశ్నలకు అతడు నేను ఉచితంగా ఇస్తే వాటి ని తయారు చేసిన వారిని అవమానించినట్లు అవుతుంది అని  మరియు పేద ప్రజలకు కూడా దాని విలువ తెలియదనే ఉద్దేశం తో పది రూపాయలకే ఇస్తున్నట్లు వివరించారు.

అలాగే పేద ప్రజలు ఈ దుస్తువులను ధరించి దీపావళి పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆశించారు అలాగే  అయన సేవాభావానికి అందరు అతడిని అభినందించడం జరిగింది. అదేవిదంగా కడపలో ఒక వస్త్ర వ్యాపారి కూడా 9 రూపాయలకే చీరను 1 రూపాయికి బ్యాగుని అందించడం తో పట్టణం లోని పేద ప్రజలందరూ ప్రత్యేకంగా మహిళలలు చీరలను కొనడానికి ఎగబడ్డారు. ఉదయం ఆరు గంటల నుండే వరసలో నిలబడి కొనుగోలు చేసారు ఈ హడావిడిలో తొక్కిసలాట కూడా జరిగింది పోలీసుల అరంగేట్రం తో సమస్య సద్దుమనిగింది.

అదేవిదంగా కరీంనగర్ ఓ షాపింగ్ మాల్ లో కూడా దీపావళి వేడుక పర్వదినాన అందరు కొత్తబట్టలు వేసుకొని పండగ జరుపుకోవాలని ప్రయత్నం లో  వస్త్ర వ్యాపారి పది రూపాయలకే చీరను విక్రయంచారు మహిళలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని కొనే ప్రయత్నం లో తొక్కిసలాట కూడా  జరిగింది. ఇలా వివిధ స్థలంలో వారి సేవ భావాన్ని చూపి వారి నుండి ప్రసంశలు పొందారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: