వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు తీపికబురు అందించింది. పోలవరం ప్రాజెక్ట్ పనులకు లైన్ క్లియర్ అయ్యింది.  పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకొనేందుకు అనుమతిని ఇస్తూ తీర్పును వెలువరించింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ పై స్టే ఎత్తేసింది.  కొత్త కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకోవచ్చని డైరక్షన్ ఇచ్చింది. 


పోలవరం హైడల్ ప్రాజెక్టు చేస్తున్న నవయుగ సంస్థ.. తమ కాంట్రాక్టు రద్దు చేయడంతో.. కోర్టుకు వెళ్లింది.  నవయుగ సదుద్దేశంతో పిటిషన్ వేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది.  ఆర్బిట్రేషన్ తర్వాత పిటిషన్ వేయడంలో అర్థం లేదన్న ఏజీ వాదనతో ఏకీభవించింది.  బ్యాంకు గ్యారంటీలను ఎన్‌క్యాష్‌ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇన్‌జంక్షన్‌ను కూడా పక్కనపెట్టింది.  దిగువ కోర్టు తీర్పును తప్పు పట్టిన హైకోర్టు.. ఇరు పార్టీల వాదనలు విని, మళ్లీ తీర్పును పునఃపరిశీలించాలని సూచించింది.


పోలవరం హైడల్  ప్రాజెక్టు నిర్మాణం కోసం నవయుగ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని జగన్  ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ హైకోర్టుని ఆశ్రయించింది. గతంలో  రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన  వాద ప్రతివాదనల నేపథ్యంలో తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని..కారణం లేకుండా కాంట్రాక్టును ఎలా రద్దు చేస్తారని నవయుగ సంస్థ తరపు అడ్వకేట్స్ ప్రశ్నించారు.

 కాంట్రాక్టు రద్దు చేస్తే ఆర్బిటేషన్‌కు వెళ్లాలే..కానీ..హైకోర్టును ఆశ్రయించడం సరికాదని సర్కార్ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయ మూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: