ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేటు బస్సులను రోడ్డెక్కించ్చేందుకు సన్నాహాలు మొదలు పెడుతుంటే మరొకవైపు ఆర్టీసీ కార్మికులు దెబ్బమీద దెబ్బ తో డీలా పడిపోయారు. ఇప్పటికే వారి ఉత్సాహమంతా నీరుగారిపోయిన నేపథ్యంలో చివరగా ఒకే ఒక ప్రయత్నంగా వారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిశారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ మరియు కేసీఆర్ సన్నిహితంగా ఒక భేటీలో పాల్గొన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఆర్టీసి జెఎసి నాయకులతో కచ్చితంగా వారికి మద్దతుగా తన గళం విప్పుతానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

మీడియా వర్గాల సమాచారం మేరకు అతను రానున్న రెండు రోజుల్లో కెసిఆర్ ను కలవనున్నారట. సమస్య ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటానంటూ ఎదురెళ్లే పవన్ కళ్యాణ్ మాటల్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన అభిప్రాయం అని అర్థమవుతుంది. అయితే తనకు ముఖ్యమంత్రి పట్ల విపరీతమైన గౌరవం ఉన్నట్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ మరో రెండు, మూడు రోజుల్లో కార్మికుల తరఫున కేసీఆర్ తో మాట్లాడేందుకు సిద్ధమయ్యాడు. దీనికి అనుగుణంగా ఒకవేళ కేంద్రం తన మాటలను పట్టించుకోకపోతే కచ్చితంగా వారికి తన సంపూర్ణ మద్దతును ఇస్తానని తెలిపారట.

ఇకపోతే ఇప్పటికే పలు రాజకీయ వర్గాల నుంచి అసలు కేసిఆర్ పవన్ కళ్యాణ్ ను సీరియస్ గా తీసుకుంటాడా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఏకంగా హైకోర్టు ఉత్తర్వుల నే బేఖాతర్ చేసిన కెసిఆర్ ఇప్పుడు జనసేనాని మాటల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం వారి తరఫున వాదిస్తున్న లాయరు ఆర్టీసీ కార్మికుల హామీలను తీర్చేందుకు దాదాపు 47 కోట్లు ఖర్చవుతుందని.... ప్రస్తుతం అంత మొత్తం ప్రభుత్వం దగ్గర లేదని చెప్పడం గమనార్హం. అయితే మొన్ననే ఉప ఎన్నికలు జరుపుకున్న హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పనులకు 100 కోట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇదంతా ఇలా ఉండగా నవంబర్ 2వ తేదీన చోటుచేసుకున్న తెలంగాణ క్యాబినెట్ లో ఆర్టీసీ వ్యవహారమే ప్రధానమైన అంశం. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలో ఆర్టీసీ ప్రైవేటీకరణ కాబోతుందట. మరి దీనిని పవన్ అడ్డుకుంటాడు లేదో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: