చంద్రబాబు నాయుడు బీజేపీతో దోస్తీ కట్టే 2014లో ఎన్నికలకు వెళ్లారనేది సుస్పష్టం. పవన్ కల్యాణ్ ప్రచారం కూడా తోడవడం బాబకు కలిసొచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు. అయితే ఆ దోస్తీ ఓ మూడేళ్లు బాగానే సాగినా తర్వాత ఆ కోటకు బీటలు వారాయి. మూడేళ్ల తర్వాత ఆ విషయం మర్చిపోయి తానే అంతా.. తానేం చేసినా చెల్లుతుంది అనే ధోరణితో బాబు పాలన సాగింది. ముఖ్యంగా బీజేపీతో విభేదించి బాబు పెద్ద పొరపాటే చేశాడు. ఆ ఫలితం 2019లో తెలిసొచ్చింది.

 

 

దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి మోదీ మలిసారి ప్రధాని అయ్యారు. బాబు ఏపీలో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తున్నారని రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ఇందుకు తగ్గట్టు బీజేపీ నాయకులు కూడా స్పందిస్తున్నారు. కానీ చంద్రబాబు తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 30న గురువారం ఆర్ఎస్ఎస్ కీలక నేతలను కలిసారని తెలుస్తోంది. మోదీతో కలిపించాలని ఇందుకు మధ్యవర్తిత్వం చేయాలని కోరినట్టు పలు వార్తలు షికారు చేస్తున్నాయి. చాలా సీక్రెట్ గా ఈ మీటింగ్ జరిగిందంటున్నారు. ప్రజలు, మీడియా దృష్టి మళ్లించేందుకే లోకేశ్ చేత ఇసుక ధర్నా చేయించి అందరి అటెన్షన్ అటువైపు మళ్లేలా చేసారని కూడా అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో రౌండ్ అవుతోంది.

 

 

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‍ఛార్జ్ సునీల్ దియోదర్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మళ్లీ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు.. ఎట్టి పరిస్థితిల్లోనూ దరి చేరనివ్వం.. ఆయనకు బీజేపీ ద్వారాలు మూసుకుపోయాయి. చంద్రబాబు ఉన్న ఏ వేదికనూ మేం పంచుకోం’ అంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. బాబు-బీజేపీ కలయిక వార్తలపై టీడీపీ వర్గాలు ఏమంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: