బాబోయ్.. మళ్ళి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకటయ్యారే. ఈసారి రాష్ట్రాన్ని ఎం చేస్తారో అని భయపడుతున్నారు ఏపీ ప్రజలు. ఎందుకు అని అనుకుంటున్నారా ? ఇంకెందుకు అండి. గతంలో 2014 లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడు.. రాష్ట్రం అభివృద్ధి 5 ఏళ్ల వెనక్కు పడిపోయింది. 


ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నాడు. మరి రాష్ట్రము ఎం అవుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. అసలు సపోర్టు ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి. నవంబర్ 3న పవన్ కళ్యాణ్ చేపట్టే లాంగ్ మార్చ్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు తన మద్దతును ప్రకటించాడు. 


రాష్ట్రంలో ఇసుకకొరతను నిరసిస్తూ నవంబర్ 3న విశాఖపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు పిలుపు ఇచ్చారు. ఈ లాంగ్ మార్చ్ ను అంతా కలిసి విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. 


ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే పలువురు చనిపోయారని వారికి అండగా నిలుస్తూ ఇసుకకొరతను నిరసిస్తూ జనసేన చేపట్టబోయే లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని చంద్రబాబుతో పాటు బీజేపీ కన్నా లక్ష్మీనారాయణను పవన్ కోరారు.


అయితే బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పవన్ తో పాటు ఇది చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వారు ఇసుక కొరతపై మెుదటి నుండి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక కొరతను నిరసిస్తూ భిక్షాటన చేశారని, సీఎం జగన్ కు లేఖలు రాశామని, గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చినట్లు వారు తెలిపారు.


అందుకే పవన్ కళ్యాణ్ తో కలవడానికి వారు సిద్ధంగా లేరని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ. చంద్రబాబు నాయుడు మాత్రం మద్దతు ఇచ్చి విజయసాయి రెడ్డి అన్నట్టు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని నిరూపించుకున్నాడు అని పలువురు ప్రముఖులు అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఫుల్ సపోర్టు పవన్ కళ్యాణ్ కె అని దీంతో అర్థం అయిపోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: