సామాన్యుడికి ఎప్పుడు సపోర్ట్ గా ఉండేది జియో. మొన్నటి వరుకు అందరూ అభిమానులు.. ఇప్పుడు కూడా అభిమానులే.. కానీ అప్పటికంటే ఇప్పుడు తక్కువ అనే చెప్పచ్చు. ఇంకా విషయానికి వస్తే.. బిలియనీర్ ముకేశ్ అంబానీ రిలియన్స్ జియో ప్రత్యర్థులైన ఎయిర్టెల్, వోడాఫోన్ కు భారీ షాక్ ఇచ్చింది. 

                                  

ఈ షాక్ నుంచి కోలుకోవాలంటే కాస్త కష్టమే.. ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమను ఈ ఊబిలో నుంచి బయటపడేసే ఉద్దీపన చర్యలు ప్రసాదించాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకున్నాయి. దీంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 

                                  

అయితే.. ఇప్పుడు వారందరికీ షాక్ ఇచ్చేలా జియో కేంద్రానికి లేఖ రాసింది. వాటి అభ్యర్థనను పట్టించుకోవద్దని, అలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటించొద్దని, అలా చేస్తే భవిష్యేత్తులో మరిన్ని సంస్దలు అలానే వస్తాయని జియో ఆ లేఖలో రాసింది. దీంతో ప్రత్యర్ధులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 

                        

రూ.1.3 లక్షల కోట్లతో పాటు వార్షిక స్థూల రాబడిపై వడ్డీతో సహా చెల్లించాలని టెలికం కంపెనీలను సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం నుంచి ఉద్దీపన కోరింది. దీనిపై స్పందించిన జియో.. ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేలా లేఖ రాసింది. ఆ లేఖలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మరి జియో రాసిన ఈ లేఖపై ప్రత్యర్ధులు ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: