డెంగ్యూ విషపు కోరల్లో రాష్ట్రం, వైద్యులనూ వదలని వైనం. డెంగ్యూ మహమ్మారి రాష్ట్రం అంతటా విస్తరిస్తుంది. మంచిర్యాల్ లో ఒక కుటుంబంలో నలుగురునీ బలితీసుకున్న ఘటనతో డెంగ్యూ బాగోతం వెలుగులోకి వచ్చింది. కానీ రాష్ట్రంలో ప్రమాద స్థాయిలో డెంగ్యూ తీవ్రత ఉంది. తదితర ప్రాంతాల్లో ఒకే రోజు ముగ్గురు చనిపోవడం జరిగింది. అయితే వీరు ముగ్గురు డెంగ్యూ జరం వల్లనే మృతిచెందారు. 


"వైద్యో నారాయణ హరి "అని ఎంతటి రోగం వచ్చినా డాక్టర్లు ఉన్నారు అన్న ధైర్యంతో ప్రజలు గుండె నిబ్బరం పొందుతున్నారు. కానీ ఈ విషయంలో ఈ సామెత తారుమారైంది వైద్యులను కూడా ఈ మహమ్మారి వదలలేదు. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఈ వ్యాధితో ఒకేరోజు ముగ్గురు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పరిధిలోని గాదెపాడుకు చెందిన కొండబోయిన లక్ష్మి (45) నాలుగురోజులుగా జ్వరంతో బాధపడుతోంది. కుటుంబసభ్యులు బుధవారం రాత్రి ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తీసుకవెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్ల వారుజామున మృతిచెందింది. 

 
భద్రాద్రి జిల్లా మణుగూరుకు చెందిన గుగులోత్ వసంత (26) రెండు రోజులుగా జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . బుధవారం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గురువారం కొత్త గూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. 


మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని నాయిని కావ్య(15) డెంగ్యూ జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు ఆమెను  మెదక్ లోని ప్రైవేటు ఆస్పత్రికి, అనంతరం హైదరాబాద్ లోని ఆస్పత్రికితరలించగా,చికిత్స పొందుతూ మృతి చెందింది. నల్లగొండ జిల్లా మర్రిగూడలో ముగ్గురు ప్రభుత్వ వైద్యులకు డెంగ్యూ సోకింది. అందులో డాక్టర్ సుమన్, డాక్టర్ రవి శంకర్ లు రక్తపరీక్షల్లో డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరో వైద్యుడు రాజేష్ కు కూడా విష జ్వరం సోకిందని అదికూడా డెంగ్యూ అని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: