ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటి. వాట్సాప్ వినియోగదారులకు ఫింగర్ ప్రింట్ లాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇప్పటివరకు ఐఫోన్ యూజర్లకు మాత్రమే వాట్సాప్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అందుబాటులో ఉండేది. వాట్సాప్ సంస్థ తీసుకున్న నిర్ణయంతో వాట్సాప్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. 
 
2019 ఫిబ్రవరి నెల నుండి ఐఫోన్ ఉపయోగించేవారికి వాట్సాప్ లో ఫేస్ ఐడీ, ఫింగర్ ప్రింట్ లాక్ అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఫీఛర్ అందుబాటులోకి రావటంతో ఆండ్రాయిడ్ యూజర్లు కూడా ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ద్వారా వాట్సాప్ ఓపెన్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు ఐఫోన్ యూజర్లు ఉపయోగిస్తున్న విధంగా ఫింగర్ ప్రింట్ లాక్ ను కూడా ఎంచుకోవచ్చు. వాట్సాప్ కు ఎంతసేపటికి లాక్ పడాలో సెట్ చేసుకోవచ్చు. 
 
వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్లు కూడా కనిపించే విధంగా చేసుకోవచ్చు. ఒకసారి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఇస్తే ఆ తరువాత ఫింగర్ ప్రింట్ ద్వారా వాట్సాప్ ఓపెన్ చేయవచ్చు. వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్ ఉపయోగించటం ద్వారా వాట్సాప్ యాప్ అనుమతి లేకుండా ఇతరులు ఓపెన్ చేసే అవకాశం ఉండదు. ఇప్పటివరకు వాట్సాప్ కు లాక్ చేసుకోవాలంటే ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించి వాట్సాప్ లాక్ చేసుకోవాల్సి వచ్చేది. 
 
వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్ ఉపయోగించాలంటే వాట్సాప్ వినియోగదారులు మొదట వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. ఆ తరువాత ప్రైవసీ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత ఫింగర్ ప్రింట్ ను సెట్ చేసుకొని ఈ కొత్త ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: