ఏపి ప్రజలందరి కష్టాలు తమ కష్టాలుగా, వారి సంతోషమే తన సంతోషంగా భావించి ప్రజలందరి కోసం, వారు మెచ్చేలా పాలన సాగిస్తూ, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ఏపి సీయం జగన్ తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందించారు.. అదేమంటే వారి వేతనాలను పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. నిన్న గురువారం 108, 104 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలసి వేతనాలు పెంచాలని విన్నవించారు. వారి వినతి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు.


అనంతరం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  తమ కష్టాన్ని గుర్తించి వేతనాల పెంపుకు భరోసా ఇవ్వడం పట్ల తమ ఆనందాన్ని తెలిపారు. అంతేకాకుండా గత 14 సంవత్సరాలుగా 108 వాహనాల్లో పనిచేస్తున్నాం. ఇదివరకు ఉన్న ప్రభుత్వం మా కష్టాలు పట్టించుకోలేదు. కాని ఇప్పుడు మేము జగన్ గారిని కలిసి మా వేదన చెప్పుకున్న వెంటనే మా కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. మా సమస్యల పట్ల ఇంతటి సానుకూలంగా వ్యవహరించిన జగన్‌కు సదా కృతజ్ఞులమై ఉంటాం.


108 వాహనాల ద్వారా మరింత మెరుగ్గా సేవలందించేందుకు కృషి చేస్తాం అని ఉద్యోగులు పేర్కొన్నారు.. ఇకపోతే ప్రస్తుతం 108 వాహనాల్లో 2 వేలమందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిలో పైలెట్‌కు ప్రస్తుతం రూ.13 వేల వేతనం ఉండగా.. దాన్ని రూ.28 వేలకు, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌)కి రూ.15 వేలు వేతనం ఉండగా.. దాన్ని రూ.30 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు.


అలాగే 104 వాహనాల్లో సుమారు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిలో ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని రూ.28 వేలకు, డ్రైవర్‌కు రూ.15,000 వేతనం ఉండగా, దానిని రూ.26 వేలకు పెంచేందుకు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేసారు.. ఇదేకాకుండా తాము సర్వీస్‌ ప్రొవైడర్‌ కింద పని చేయలేమని విన్నవించగా..స్పందించిన  సీఎం జగన్ గారు అందర్నీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేసే విధంగా చేస్తామని  అన్నారని వారు తెలిపారు. ఇకపోతే 108 ఉద్యోగులకు జగన్ ఇచ్చిన వరాలను మురిసిపోతూ ఒడిసిపట్టుకుని ఆయన మేలును జన్మలో మరువబోము అనుకుంటూ వెళ్లిపోయారు 104, 108  ఉద్యోగులు...


మరింత సమాచారం తెలుసుకోండి: