చంద్రబాబు ఇసుక రాజకీయం జోరు పెంచారు. ఇక ఇసుక గురించి బాబు అతిశయోక్తులకు అంతేలేకుండా పోతోంది. 3,500  ఇసుక ఇప్పుడు 45,000 పలుకుతోందంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ వాదనను వైసీపీ సోషల్ మీడియా చీల్చిచెండాడుతోంది. ఇవిగో అసలు వాస్తవాలు అంటూ కొన్ని లెక్కలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. అవేంటో చూద్దాం..


“ నిజంగా 45,000 పెట్టి సామాన్యులైనా, లేక భారీ నిర్మాణాలు చేసేవారైనా ఇసుకను కొంటారా?బాబు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే... నాలుగు గదులతో ఉండే ఓ సాధారణ ఇంటి నిర్మాణానికి 15 యూనిట్ల ఇసుక కావాల్సి ఉంటే....లారీ రూ.45,000 చొప్పున 15 యూనిట్ల ఇసుకకే రూ.3,15,000 ఖర్చు అవుతుంది. చెబితే కనీసం నమ్మేలా అన్నా ఉండాలిగదా.. ఊహూ బాబుకు అవేం పట్టవు. గ్రాఫిక్లు చూపించినంత సులువుగా లాజిక్ కు అందని అబద్ధాలు పుట్టించేస్తుంటాడు.


యూనిట్ ఇసుక గతంలో రూ.4000 నుంచి రూ.5000 ఉండేది.ఒక యూనిట్ అంటే నిర్మాణ పరిభాషలో ట్రాక్టర్ ఇసుక అని అర్థం.రవాణా ఛార్జీలు దీనికి అదనం. బాబు గారి హయాంలో సరఫరా అయ్యే ఇసుక ఎటు తరలిపోతోందో తెలియని పరిస్థితి. ఉచితం అయినప్పుడే ఇసుక ఇంత ఖరీదు అయితే రవాణా ఛార్జీలు పోగా మిగిలిన ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టో చంద్రబాబు జవాబు చెప్పాలి.


నూతన ఇసుక విధానంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయం నేడు ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది కానీ ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి కాదు.అలాగే ఇసుక మాఫియాను కట్టడి చేస్తూ, పర్మిట్ వాహనాలకే అనుమతి ఇస్తూ ఇసుక రవాణాకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసారు.ఒక్క లారీ కూడా రాష్ట్రం దాటి పోకుండా నిఘా పెడుతున్నారు. మరో 14 రోజుల్లో ఇసుక కొరత లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నారు. కానీ బాబు మాత్రం నిన్నటిదాకా ఇసుక బొక్కిన నోటితో నేడు ఇసుక ఖరీదు గురించి కాలక్షేపం రూమర్లు ప్రచారం చేస్తున్నాడు.” ఇదీ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: