ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన వల్లభనేని వంశీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.నవంబర్ మూడు లేదా నాలుగు తేదీల్లో వల్లభనేని వంశీ వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. నవంబర్ మొదటి వారంలో  వైసీపీలో చేరాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.ఈ మేరకు వల్లభనేని వంశీ తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ నెల 27వ తేదీన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి,  గన్నవరం ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు.
గన్నవరం  అసెంబ్లీ నియోజకవర్గంలో  నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి పోలీసులు  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది.


తనపై కేసు నమోదుకు సంబంధించి స్థానిక వైసీపీ నేతలు ఉన్నారని వల్లభనేని వంశీ ఈ నెల 24వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. ఈ మేరకు రెవిప్యూ అధికారులకు వైసీపీ నేతల ఫిర్యాదులకు సంబంధించిన మెయిల్స్ ను కూడ వల్లభనేని వంశీ వివరించారు.ఈ నెల 25వ తేదీ ఉదయం బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిని కలిసిన వల్లభనేని వంశీ అదే రోజు సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. జగన్‌ను కలిసిన తర్వాత వైసీపీలో వంశీ చేరుతారని ప్రచారం సాగింది. రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడ వల్లభనేని  వంశీ ప్రకటించారు. ఈ ప్రకటనతో వల్లభనేని వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబునాయుడు విజయవాడ ఎంపీ కేశినేని  నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కమిటీని ఏర్పాటు చేశారు. కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావులు వల్లభనేని వంశీతో  బుధవారం నాడు రాత్రి భేటీ అయ్యారు.



సుధీర్ఘంగా ఆయనతో చర్చించారు. అక్రమ కేసుల కారణంగా తనతో పాటు తన అనుచరులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. టీడీపీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను కూడ వంశీ కేశినేని దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులపై పోరాటం చేసేందుకు చంద్రబాబుతో పాటు పార్టీ మొత్తం అండగా ఉంటుందని కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు చెప్పారు. టీడీపీలో ఉన్న అంతర్గత సమస్యల పరిష్కారానికి చంద్రబాబు తరపున కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు హామీ ఇచ్చారు.వల్లభనేని వంశీతో చర్చల సారాంశాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుకు వివరించారు. వల్లభనేని వంశీ  ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే కొనసాగుతామని ఆయన అనుచరులు ఇదివరకే ప్రకటించారు. వంశీపై కేసులు పెడితే కనీసం టీడీపీ జిల్లా నాయకత్వం ఎందుకు స్పందించలేదని  వంశీ అనుచరులు ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: