కేంద్రం ఆధార్ కార్డును ప్రవేశపెట్టిన కొత్త లో ఆదరాబాదరాగా ఆధార్ కార్డు నమోదులు జరుగాయి . కాగా  ఆదరాబాదరా  ఆధార్ నమోదు వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఇంటి పేరులో తప్పులు,  అక్షర దోషాలు, పుట్టిన తేదీలు చిరునామాలు తప్పులు ఇలా చాలా సమస్యలలో ప్రజలు ఎదుర్కొన్నారు. దీంతో ఆధార్ కార్డు లోని సమస్యలను సరిచేయడానికి ఆధార్ కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో యుఐడిఏవై తో రెండున్నరేళ్ల క్రితం తపాలాశాఖ తపాలాశాఖ ఆధార్ సేవలు అందించేందుకు ఒప్పందం  చేసుకున్న  విషయం తెలిసిందే. ఆ తర్వాత తపాలశాక ఆధార్ అధీకృత కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తోంది. అయితే గతంలో కేవలం ఆధార్ అప్డేషన్  కు మాత్రమే పరిమితమైన పోస్టల్ శాఖ ఏడాది కాలంగా ఎన్రోల్మెంట్ సేవలను కూడా అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ లో ప్రతి రోజు  30 మంది వరకు ఆధార్ సేవలు అందిస్తుంది . అంతేకాకుండా ఆధార్ కేంద్రాల కంటే పోస్ట్ ఆఫీస్ లలోనే  ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. 



 ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోస్ట్ ఆఫీస్ శాఖలో ఆధార్ సేవలు అందిస్తున్నారు అధికారులు . అయితే కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకునే వారికి ఉచితంగా సేవలు అందిస్తుండగా ... ఆధార్ కార్డ్ అప్డేషన్ కు మాత్రం 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. కాగా  తపాలశాక మరో సరికొత్త ఆలచనతో వినూత్న  సేవలతో ముందుకొస్తోంది. ఇప్పటి వరకు ఆధార్ సేవలను పోస్టల్ శాఖలోనే అందించగా  ఇప్పుడు డోర్ డెలివరీ చేసేందుకు నిర్ణయించింది  పోస్టల్ శాఖ. భాగ్యనగరంలో ఇప్పుడు వరకు వివిధ ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పోస్టల్ శాఖ... ఇప్పుడు ప్రజల ఇంటి వద్దకే వచ్చి ఆధార్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఆధార్ నమోదు ఆధార్ మార్పు సహా మరికొన్ని ఇతర సేవలను ఇంటి వద్దకే వచ్చి అందించనుంది పోస్టల్ శాఖ. ఇక నుంచి ఆధార్ సేవలకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు... ఆధార్ సేవలు అవసరమైనప్పుడు పోస్టల్ శాఖ కు సమాచారం ఇవ్వడమే తరువాయి... ఆధార్ సేవలు  ఇంటి ముంగిట్లొకి  వచ్చేస్తాయి. 



 అయితే ఆధార్ సేవలను ప్రజలు ఇంటివద్దకే తీసుకొచ్చి  ఇంటివద్దే ప్రజలకు ఆధార్ సేవలందించడానికి నిర్ణయించిన పోస్టల్ శాఖ ... ఆధార్ సేవలు అవసరం ఉన్నవారు కనీసం 30 మంది కంటే ఎక్కువ ఉంటే వారి ఇంటి వద్దకే వచ్చి ఆధార్ స సేవలు అందిస్తామని హైదరాబాద్ అబిడ్స్ జనరల్  పోస్ట్ ఆఫీస్ చీప్ పోస్ట్ మాస్టర్ జయరాజు  ప్రకటించారు. ఆధార్ సేవలు అందించేందుకు ప్రజల ఇళ్లకు వచ్చే తమకు కేవలం విద్యుత్ సౌకర్యం కల్పిస్తే సరిపోతుందని జయరాజు  తెలిపారు. ఈ సౌకర్యాన్ని అపార్ట్మెంట్ వాసులు,  కాలనీ కమిటీలు ఉపయోగించుకోవాలని తెలిపిన  ఆయన... తమను  సంపాదించడానికి 9440644035 నెంబర్కు కాల్ చేసి సమాచారం ఆధార్ సేవలు పొందవచ్చని  హైదరాబాద్ అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ చీఫ్ పోస్ట్మాస్టర్ జయరాజ్  తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: