తెలంగాణలో రేపటి నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు కానుంది. 2,216 మద్యం దుకాణాల లక్కీ డ్రా ద్వారా దుకాణాదారుల ఎంపిక పూర్తవ్వగా.. కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.975.68 కోట్ల ఆదాయం అందింది. నవంబర్ 2 వ తేదీ  నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు.. మందు బాబులకు పండగే..తెలంగాణలో రేపటి నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు కానుంది. 2,216 మద్యం దుకాణాల లక్కీ డ్రా ద్వారా దుకాణాదారుల ఎంపిక పూర్తవ్వగా.. కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.975.68 కోట్ల ఆదాయం అందింది.తెలంగాణలో ప్రక్రియ మొదలయింది. అన్ని జిల్లాల్లో ల ద్వారా కేటాయింపులు చేస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య జిల్లా కలెక్టర్లు మద్యం షాపుల కేటాయింపున కు  లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు.


 కామారెడ్డిలో 40 మద్యం దుకాణాలకు గాను 475 దరఖాస్తులు చేసుకున్నారు. కలెక్టర్ సత్యనారాయణ లక్కీ డ్రా విధానం ద్వారా 40 మందిని ఎంపిక చేశారు. ఇందులో 6గురు మహిళలు 34 మంది పురుషులు మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. పలు జిల్లాల్లో ఎక్సైజ్‌ అధికారుల పర్యవేక్షణలో లక్కీ డ్రా ప్రక్రియ జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా  కలెక్టర్ కృష్ణ భాస్కర్ సమక్షంలో లక్కీ డీప్ ధ్వారా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ జరిగింది.  జిల్లాలో మొత్తం 41 మద్యం దుకాణాలకు గాను 648 మంది దరఖాస్తులు చేశారు. వీటిలో 88 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని 6 వ నెంబర్ దుకాణానికి అత్యాదికంగా 36 మంది దరఖాస్తు చేసుకోగా, రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలోని మద్యం దుకాణానికి కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కాగా జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ఖరారు చేసి.. 



గతంలో ఉన్న నాలుగు స్లాబులను ఆరు స్లాబులకు పెంచిన విషయం తెలిసిందే. ఇక, మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. 5000లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షలు, ఐదు వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.కోటి 10 లక్షల ఏడాది లైసెన్స్ ఫీజును నిర్ణయించారు. 2021 అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది. ఇక, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: