రెండ్రోజుల కింద‌ట వ‌చ్చిన ఓ వార్త ప‌లువురిని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసిన సంగ‌తి తెలిసిందే. పరిమితికి మించి బంగారం ఉంటే దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ‘‘గోల్డ్​ ఆమ్నెస్టీ’’పేరుతో కొత్త స్కీమ్ తీసుకురానున్నట్లు వార్తలు వ‌చ్చాయి. రశీదులు లేకుండా కొన్న లెక్కల్లోకి రాని బంగారాన్ని బయటపెట్టి, దానికి పన్ను చెల్లించి చట్టబద్ధం చేసుకునేలో వ్యక్తులు, సంస్థల కోసం ఓ క్షమాభిక్ష పథకాన్ని మోదీ సర్కారు తేనుందన్న ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.ఆదాయం పన్ను (ఐటీ) శాఖ పరిశీలనలో పసిడి క్షమాభిక్ష పథకం వంటివేవీ లేవని వెల్లడించింది. కాగా, బడ్జెట్ కసరత్తు మొదలైనప్పుడు ఇలాంటి పుకార్లు రావడం సహజమేనని సదరు వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే, కేంద్రం వెన‌క్కు త‌గ్గ‌డం వెనుక‌...అస‌లు లెక్క‌లు వేరంటున్నారు.


పెద్ద నోట్ల రద్దు...అనంతరం ప‌రిణామాలు..బంగారం విష‌యంలో బీజేపీ పెద్ద‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేశాయ‌ట‌.  2016 నవంబర్ 8వ తేదీ రాత్రి రూ.1,000, 500 నోట్లు ఇక చెల్లబోవని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేయ‌డం...ర‌ద్దెన నోట్ల స్థానంలో కొత్తగా రూ.500, 2,000 నోట్లను పరిచయం చేయగా, పాత వాటిని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసి అంతే విలువైన కొత్త నోట్లను తీసుకోవచ్చని మోదీ సూచించారు. చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 80 శాతానికిపైగా రాత్రికిరాత్రే రద్దవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంత‌రం వాటిని మార్చుకున్నారు. అయితే, ఈ క్రమంలో 99.3 శాతం పాత నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయి. రద్దు నాటికి రూ.15.41 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇందులో రూ.15.31 లక్షల కోట్ల విలువైనవి తిరిగి వచ్చినట్లు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఫలితంగా దేశ చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణ.. విఫల యత్నంగా మిగిలడ‌మే...కాకుండా పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టింది.


పెద్ద నోట్ల రద్దు జరిగి మూడేండ్లు కావస్తుండటంతో మ‌రో కీల‌క నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌నే భావ‌న‌లో ప్ర‌జ‌లు ఉన్నార‌ని...పైగా వ్య‌తిరేకంగా ప‌రిణామాలు మారుతున్నాయ‌ని గ‌మ‌నించి...కేంద్రం వెన‌క్కు త‌గ్గింద‌ని స‌మాచారం. దేశం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ.. ఇలాం టి నిర్ణయం మంచిది కాదనే ప్రభుత్వం వెనుకకు తగ్గిందని తెలుస్తున్నది. ముఖ్యంగా మహిళల నుంచి ఎలాంటి స్పందన ఎదురవుతుందోనన్న భయాలు ఏర్పడ్డాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: