హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిని కూతురు హత్య చేసిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ... అయ్యే తల్లిని కూతురు చంపుతుందా ...దుర్మార్గురాలు అంటూ తిట్టిపోశారు . అయితే రజిత హత్యోదంతానికి దారితీసిన పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తున్నాయి . రజిత భర్త డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు . ఇక రజిత చిట్టిలను వేస్తూ ఆర్ధిక స్థిరత్వాన్ని సంపాదించే ప్రయత్నం చేసింది . ఇదే అదనుగా తీసుకుని వారి పక్క ఇంట్లో నివసించే శశికుమార్ , రజిత ఆస్తిని దక్కించుకోవడానికి కీర్తిరెడ్డి పై కన్నేశాడు .


అదను కోసం ఎదురు చూస్తున్న శశికుమార్ కు, ఆమె మొదటి ప్రియుడు  బాల్ రెడ్డి   కారణంగా గర్భం దాల్చిన కీర్తిరెడ్డి అబార్షన్ చేయించుకోవడానికి  సహాయం చేయాల్సిందిగా అతన్నే కోరింది .  కీర్తిరెడ్డి ని అమన్ గల్ కు తీసుకువెళ్లి ఎవరికీ తెలియకుండా శశికుమార్ అబార్షన్ చేయించాడు . ఇదే అదనుగా ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకుని శారీరకంగా లోబర్చుకున్నాడు . రజిత  ఆస్తిపై కన్నేసిన శశికుమార్ ఆమెను అడ్డు తొలగించుకుంటే  ఆస్థి మొత్తం తమకే దక్కుతుందని కీర్తిరెడ్డికి నూరిపోశాడు  . కీర్తిరెడ్డి కూడా అతని ట్రాప్ లో పడిపోయింది.


 కీర్తిరెడ్డి కి బీరు తాగే అలవాటు ఉండడం తో , ఈ నెల 19  వ తేదీన ఆమెను కారులో బయటకు తీసుకువెళ్లి బీరు తాగించి , ఇంటికి తీసుకువచ్చాడు.  రజిత ఇంట్లో ఉండగా ఆమె పక్కన వెళ్లి కీర్తిరెడ్డి కూర్చుని తల్లి కళ్ళలో కారం కొత్తగా , శశికుమార్ ఆమె మెడ కు చున్నీ బిగించి హత్యచేశాడు . మూడు రోజుల పాటు ఇంట్లోనే శవాన్ని పెట్టుకుని ఆ తరువాత తీసుకువెళ్లి రామన్నపేట రైల్వే ట్రాక్ పై పడేసి వచ్చారు .


మరింత సమాచారం తెలుసుకోండి: