గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన పై అక్రమ ఆస్తుల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అక్రమాస్తుల కేసును సీబీఐకి అప్పగించగా జగన్ నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరవుతూ వస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో సొంతం చేసుకున్న వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగ... సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి  అక్రమాస్తుల కేసులు ఇబ్బందిగా మారాయి . ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది.



ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టుకు హాజరు అవడం వల్ల ప్రజలకు మెరుగైన పాలన అందించలేను  అని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టుకు హాజరు విషయంలో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని... నాకు కోర్టుకు హాజరు కావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కానీ తాను బాధ్యతగల ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి... తాను సిబిఐ కోర్టుకు ప్రతివారం హాజరు కావడం వల్ల తన అధికారిక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను ప్రతివారం సిబిఐ కోర్టుకు హాజరు కావడం వల్ల 60 లక్షలు ఖర్చు వరకు వస్తుందని... ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిగ్గా  లేనందువల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడకూడదనే  ఉద్దేశంతోనే తనకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు పై  వ్యక్తిగత మినహాయింపు  కావాలని కోరుతున్నానని  ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.



అయితే అటు సీబీఐ అధికారులు మాత్రం జగన్ వేసిన పిటీషన్పై సుముఖంగా లేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నమోదైనది మామూలు అభియోగాలు కాదని  తీవ్ర అభియోగాలను తెలిపిన సీబీఐ అధికారులు... ఎంపీ గా ఉన్నప్పుడే  సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని... ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్  సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఇంకా ఎక్కువ ఉందని సీబీఐ ప్రత్యేక కోర్టులో తన వాదన వినిపించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ  ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెల్లడించేందుకు నేటికి వాయిదా వేసింది. అయితే జగన్ అక్రమాస్తుల కేసుల పై సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎలాంటి తీర్పు వెలువడుతుందా అని  ఆంధ్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది . వ్యక్తిగత హాజరు కు మినహాయింపు  కావాలంటూ జగన్ మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. జగన్ విచారణకు హాజరు కావాల్సిందేనంటూ  కోర్టు తేల్చి చెప్పింది. జగన్ కు  మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ అధికారులు  చెప్పడంతో సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: