పెళ్లంటే రెండు జీవితాల కలయిక, ఒకరికోసం ఒకరు బతకడం. రెండు కుటుంబాల మధ్య కొత్త బంధాలనుఏర్పరిచే  పెళ్లి పైన భారతీయులకు  ఎనలేని నమ్మకం. ఎక్కడో పుట్టి పెరిగి భర్త కోసం అత్తింటి వాసం చేయడానికి సిద్ధమైన మహిళను ఎంతో ప్రేమగా చూసుకునే బాధ్యత భర్తకు ఉంటుంది. జీవిత భాగస్వామి అయిన భర్త కోసం తన ఇంటి వారిని వదిలి చిన్నప్పట్నుంచీ పెరిగిన ఇంటిని వదిలి వధువు అత్తింటికి వస్తుంది. అయితే ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న సంఘటనలు పెళ్లి అనే మాట మీద విరక్తి వచ్చే విధంగా ఉంటున్నాయి. 


కుషాయిగూడకు చెందిన ముస్తఫాకు మూడు నెలల క్రితం రుక్సానాతోవివాహమయ్యింది. కొద్దిరోజులు కాపురంసజావుగా నే సాగింది. ఇంతలోనే ఏమైందో తెలీదు భార్యకు తలాక్ చెప్పాడు.భర్త తలాక్ చెప్పడంతో షాక్ తిన్న రుక్సానాకారణం అడిగింది.  భర్త చెప్పినకారణంతోరుక్సానాకు దిమ్మతిరిగింది. రుక్సానాకు పళ్లు ఎత్తుగా ఉన్నాయని, అందుకే తలాక్చెప్పినట్లు ముస్తఫా రుక్సానాకు బదులిచ్చాడు. రుక్సానా మాత్రం తన భర్త, అత్తింటివాళ్లు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తోంది.

తలాక్ మరియు అదనపు కట్నం వ్యవహారంపై కుషాయిగూడా పోలీసులకు రుక్సానా  ఫిర్యాదు చేసింది.పోలీసులు రుక్సానా ఫిర్యాదు పై స్పందించారు. ముస్తఫాపై కేసు నమోదు చేసి, ఈ తలాక్ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. రుక్సానా అత్తింటివారిని పిలిచి ప్రశ్నిస్తున్నారు. అయితే  ఈ తలాక్ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


కేంద్రం కొద్ది నెలల క్రితమే ట్రిపుల్ తలాక్ పై కొత్త చట్టంతెచ్చింది. ఇకపై ఎవరైనా తలాక్ చెబితే కేసునమోదు చేస్తారు. మూడేళ్ల పాటూ జైలు శిక్ష విధిస్తారు అని  ఈ చట్టం  చెబుతోంది. ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా జనాల్లో మాత్రం ఏవిధమయిన మార్పు లేదు , దేశవ్యాప్తంగా  అక్కడక్కడా తలాక్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: