దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లను హెచ్చరిక తెలుపుతుంది. మోసగాళ్ల వలలో పడవద్దు అని తెలుపుతుంది. లేదంటే నష్టపోవాల్సి వస్తుందని వెల్లడిస్తుంది. దీనికి సంబంధించి బ్యాంక్ ఇప్పటికే తన ఖాతాదారులకు ఎస్ఎంఎస్ రూపంలో అలర్ట్‌లను కూడా పంపడం జరిగింది. అసలు విషయానికి వస్తే ‘అకౌంట్ స్టేటస్‌’ను ఆన్‌లైన్‌లో చేసుకోవద్దు.. చూసుకున్నారు అంటే అంతే మీ కథలో డబ్బులు మాయం అవుతాయి.


స్మార్ట్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయవద్దని తెలియచేస్తుంది. ‘మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ రద్దయ్యింది. ఈ లింక్‌పై క్లిక్ చేసి మళ్లీ అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోండి’ అంటూ మోసగాళ్లు ఎస్ఎంఎస్‌లు పంపిస్తారని పూరి వివరాలు తెలిపింది. లింక్‌పై క్లిక్ చేస్తే అకౌంట్‌ దారుల వివరాలన్నీ మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయని హెచ్చరించడం జరిగింది.


ఎస్ఎంఎస్‌లతో జాగ్రత్తగా ఉండాలని తెలియచేయసింది. అలాంటి సందర్భాల్లో ఆ లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచించింది. వ్యక్తిగత, అకౌంట్ వివరాలను ఎవ్వరికీ కూడా షేర్ చేయవద్దని హెచ్చరించడం జరిగింది. కేవలం బ్యాంకుకు వెళ్లి మాత్రమే అకౌంట్ స్టేటస్‌ను తెలుసుకోవాలని సలహా వెల్లడించింది. ఇలాంటి మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ ఎప్పటికీ కూడా ఖాతాదారుల వివరాలను సేకరించదని స్పష్టం తెలియచేయడం జరిగింది.


ఎస్‌బీఐ ఖాతాదారులు చాల జాగ్రత్తగా  ఉండాలి. అటువంటి ఎస్ఎంఎస్‌లు జాగ్రత్తగా చదివి ముందుకు కొనసాగాల్సి ఉంటుంది అని తెలిపింది ఎస్‌బీఐ. రోజు రోజుకి ఈ లాంటివి చాల బాగా పెరిగి పోతున్నాయి. ఖాతాదారులు  జాగ్రత్తగా ఉండాలి అని  ఎస్‌బీఐ తెలియ చేస్తుంది. ఎటువంటి పరిస్థితిలోనూ అకౌంట్ స్టేటస్‌ ఆన్లైన్లో చెక్ చేసుకోవద్దు అని తెలిపింది. ఒక వేళా చూసుకోవాల్సి వస్తే  సమీపంలో ఉన్న బ్యాంకుని సంప్రదించడం మంచిది అని ఎస్‌బీఐ తెలియచేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: