మాజీ ప్రధానమంత్రి  డాక్టర్ మన్మోహన్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా అయన వేడుకలు జరుపుకున్నారని మరియు కేక్ కట్ చేసే దృశ్యాలు  సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల వచ్చిన సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ది ఆక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'  చిత్రం లో చూపిన విదంగా మన్మోహన్ సింగ్  గారు ప్రధాని పీఠం  మాత్రం దక్కించుకున్నారు కానీ అధికారాలు మాత్రం కాంగ్రెస్ నాయకుల చేతిలోనే ఉంది అని అర్ధం అవుతుంది. 

అయితే  ఈ వేడుకులలో కూడా అయన పుట్టిన రోజు కు ఏర్పాటు చేసిన కేక్‌ని కూడా మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహా  పర్మిషన్ తీసుకున్నారని మరియు  అయన ఇంకా ఆయన  కాంగ్రెస్ అనే బానిస సంకెళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు అని రావడం లేదు అని  చివరకు ఆయన పుట్టినరోజు కేకును కూడా కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ నే  కట్ చేస్తున్నారు అని  ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.

అసలు ఎం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నించినా మీడియా వారు కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా ఆ పోస్ట్ మన్మోహన్ సింగ్ పుట్టిన రోజు కేక్ కాఫు అని అలాగే వారికీ  రాహుల్ గాంధీ  పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉంటుంది అని  వారు తెలియచేసారు.మన్మోహన్ సింగ్ చాల సౌమ్యుడని, ఆర్థికశాస్త్ర మేధావి అని అయన ప్రభుత్వం లోనే ఇండియా చాల సాధించింది అని అయన చేసిన సంస్కరణలే ఎప్పుడు భాజపా వాళ్ళు వారు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

ఆ కేక్ కట్ చేసింది మన్మోహన్ సింగ్  పుట్టినరోజు నాడు కాదు అని అది కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం రోజు అని వివరాయించారు అలాగే భాజపా వారు ఇదంతా చేస్తున్నారని వీటిని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం భాజపా వాళ్ళు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: